బ్లాక్ లో ఆక్సిజన్ సిలిండర్స్ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

హైద‌రాబాద్: బ్లాక్ లో ఆక్సిజన్ సిలిండర్స్ విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. రాస్ ఏజెన్సీ పేరుతో అక్రమంగా ఆక్సిజన్ సిలిండర్లు అధిక ధరలకు అమ్ముతున్నాడు షేక్ హుసేన్. కొన్ని రోజులుగా హోం క్వారంటైన్ లో కారోనా చికిత్స తీసుకుంటున్న వారికి అధిక ధరలకు ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ లో అమ్ముతున్నాడు.

స‌మాచారం అందుకున్న సెంట్ర‌ల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అత‌డి ద‌గ్గ‌రి నుంచి 87 ఆక్సిజన్ సిలెండర్స్ , 50 కిలోల ఆక్సిజన్ సిలెండర్స్ , 14 చిన్న సీలిండర్స్ స్వాధీనం చేసుకున్నారు. పలు క్లినిక్స్,ఆస్పత్రులకు సిలిండర్లు విక్రయించినట్లు గుర్తించారు. అంతేకాదు, కొంతమందికి ఇళ్ల వద్దకే సిలిండర్స్ పంపించినట్లు గుర్తించారు సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.

Latest Updates