పట్నం: గణేష్ నిమజ్జనానికి భారీ భద్రతా ఏర్పాట్లు

హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. శోభాయాత్ర జరిగే అన్ని రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. నిమజ్జనంలో హైదరాబాద్ సహా ఇతర జిల్లాల సిబ్బంది, కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

ఖైరతాబాద్ మహాగణపతి వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు  మొదలయ్యాయి. రేపు మధ్యాహ్నం వరకు నిమజ్జనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం గణపయ్య దగ్గర ఉన్న కర్రలను తొలగించిన సిబ్బంది… ప్రస్తుతం గణపయ్యను తరలించే ట్రక్కును రెడీ చేస్తున్నారు. ఇప్పటికే వెల్డింగ్ పనులు మొదలు పెట్టారు.

Latest Updates