చౌరాసియా దాడి కేసు.. నిందితుడు అరెస్ట్

చౌరాసియా దాడి కేసు.. నిందితుడు అరెస్ట్

కేబీఆర్ పార్కులో నటి చౌరాసియాపై దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు బాబు సినిమా షూటింగ్‌లో లైన్ మేన్‌గా పనిచేస్తున్న బాబుగా గుర్తించారు. నటిపై దాడి చేసి అనంతరం ఆమె సెల్ ఫోన్ బాబు లాక్కెళ్లినట్లు గుర్తించారు. దాడి చేసిన తర్వాత బాబు కృష్ణా నగర్‌లో ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. కేబీఆర్ పార్కులో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్లే నిందితుడ్ని గుర్తించడంలో ఆలస్యం అయినట్లు తెలిపారు. 

దాడికి సంబంధించిన విషయాలు సీపీ అంజనీ కుమార్ మీడియాకు వెల్లడించారు. నిందితుడికి నేర చరిత్ర ఉందని తెలిపారు. కొందరు పార్కులో క్రైమ్ చేసేందుకు కూడా వస్తారన్నారు. ఈ కేసు విచారణ చేపట్టి త్వరగా నిందితుడ్ని పట్టుకున్న పోలీస్ టీంను సీపీ అభినందించారు. కేబీఆర్ పార్క్‌లో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.  కేబీఆర్ పార్క్ పై మరింత దృష్టి పెడుతామన్నారు.  సీసీటీవీ ఇష్టాలేషన్- మరమ్మతుల కోసం బడ్జెట్ సమస్య ఉందన్నారు. 

కేబీఆర్ పార్క్ లో vip లు వాకింగ్ కి వస్తుంటారన్నారు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్.  హైదరాబాద్ లోని అన్ని చోట్లా ఇంకా సీసీటీవీలు లేవన్నారు. ఏ కేసును చేధించాలన్నా టెక్నాలజీ తప్ప వేరే ఆప్షన్ లేదన్నారు. దేశంలో మనం నెంబర్ స్థానంలో ఉన్నా ఇది చాలదన్నారు. ఇంకా సీసీటీవీ కెమెరాలు అవసరమన్నారు.  ప్రతి రోజు 50లక్షల మంది రోడ్లపై ఉద్యోగాలు చేస్తారని..- ఎవరు క్రైమ్ చేస్తారు అనేది ఊహించలేమన్నారు.