స్టూడెంట్ వీసా మీద హైద‌రాబాద్‌కు వ‌చ్చి డ్రగ్స్ దందా

హైదరాబాద్: న‌గ‌రంలోని యువ‌త‌ను ల‌క్ష్యంగా చేసుకొని డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ నైజీరియన్ ను అదుపులోకి తీసుకున్నారు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. స్టూడెంట్ వీసా మీద హైద‌రాబాద్‌కు వచ్చిన డానియల్ అనే వ్య‌క్తి న‌గ‌రంలో చదువుతూనే డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. లంగర్ హౌస్ లో డ్రగ్స్ సరఫరా చేస్తుండగా వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు‌ పట్టుకున్నారు. నిందితుడి నుండి 6 గ్రాముల కోకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. నైజీరియ‌న్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు లంగర్ హౌస్ పోలీసులు.

ఇదిలా ఉండగా లంగర్ హౌస్ పోలీసులు.. టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకొని ఇచ్చిన కేసులను మాత్రమే నమోదు చేస్తున్నారని, ఇక్కడ జరిగే అక్రమ వ్యాపారాలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో గంజాయి, లాటరీ ఇలా అనేకమైన అక్రమ దందా లను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకొని లంగర్ హౌస్ పోలీసులకు అప్పగించారు.

Latest Updates