దొంగ టిక్కెట్లు : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్: నకిలీ పేర్లతో విమానం టికెట్లు బుక్ చేసుకుని ఢిల్లీ వెళ్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన సోమవారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో జరిగింది. టికెట్ పైన ఒక పేరు.. ఐడీ ఫ్రూఫ్ లో మరో పేరు ఉండడంతో ఎయిర్ పోర్ట్ అధికారులు వారిని అడ్డుకున్నారు. పొంతనలేని సమాధానం చెప్పడంతో నిందితులను ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు ఎయిర్ పోర్ట్ అధికారులు.

దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితులు కర్నాటక లోని రాయిచూర్ ప్రాంతానికి చెందిన దౌల్సాబ్, లక్ష్మీ గా గుర్తించారు. సిటీలో వరుస దొంగతనాలు జరుగుతుండగా..ఇలాంటివారిపై ఓ కన్నేయాలని ఎయిర్ పోర్ట్ స్టాఫ్ కు సూచించారు పోలీసులు.

Latest Updates