వ్యాపారవేత్త ఇంట్లో చోరీ కేసును ఛేదించిన పోలీసులు

హైద‌రాబాద్: ఈ నెల 3న సైనిక్‌పురిలోని కుషాయిగూడ లో ఓ రియల్టర్ ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఇంటి వాచ్‌మెన్‌ ఈ చోరీకి పాల్పడినట్లు నిర్ధారించారు. ఈ కేసులో రాచకొండ పోలీసులు నలుగురు నిందితులను చెన్నై లో అరెస్ట్ చేసినట్లు సమాచారం. వాచ్‌మెన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యాపారవేత్త నరసింహారెడ్డి ఇంటి నుంచి 2కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదు దొంగిలించారు ప‌నివాళ్లు . వ్యాపార‌వేత్త కుమారుడి రెసెప్షన్ కోసం కుటుంబం మొత్తం ఫలక్ నామ ప్యాలెస్ కు వెళ్లిన సమయంలోఈ చోరీ జ‌రిగింది. సీసీటీవీ విజువల్స్..సెల్ టవర్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు నిందితుల‌ను పట్టుకున్నారు. వాచ్‌మెన్ దంపతులతో పాటు వారికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

robbery case

Latest Updates