టెక్ మహీంద్రా , ఇన్ఫోసిస్‌లలో ఉద్యోగాలిప్పిస్తామని భారీ మోసం

ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. టెక్ మహీంద్రా , ఇన్ఫోసిస్ కంపెనీ లలో ఉద్యోగాలు ఇప్పిస్తామని సోషల్ మీడియా ద్వారా నమ్మించి ముగ్గురు వ్యక్తుల నుండి ఈ సైబర్ కేటుగాళ్లు 8 లక్షల రూపాయలు వసూలు చేశారు.  హైదరాబాద్ కి చెందిన ఆ ముగ్గురు బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేయడంతో  కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో గుంటూరు జిల్లా నరసరావుపేటకి చెందిన నవీన్ అలియాస్ ప్రవీణ్,  కృష్ణ జిల్లాకి చెందిన శివకుమార్ అలియాస్ రవి కిరణ్ లు ఈ సైబర్ క్రైమ్ పాల్పడుతున్నారని తెలిసి అరెస్ట్ చేశారు. అనంతరం వారిని రిమాండ్ కు తరలించారు. వారి నుండి పలు బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులు, 4 సెలెఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని విచారించి మరిన్ని మోసాలు బయటపెడతామని పోలీసులు తెలిపారు.

hyderabad-police-have-arrested-a-gang-offering-fake-employment

Latest Updates