సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోహిత ఆచూకీ దొరికింది

గచ్చిబౌలి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రోహిత మిస్సింగ్ మిస్టరీని ఛేదించారు హైదరాబాద్ పోలీసులు. నెలనుంచి కనిపించకుండా పోయిన రోహిత ఆచూకీని పూణేలో కనిపెట్టారు. కుటుంబ కలహాలతోనే ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. రోహితను సాయంత్రానికి హైదరాబాద్ తీసుకువచ్చి, ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు పోలీసులు.

నానక్‌రాంగూడలోని ఆపిల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్న రోహిత, గతంలో  చాదర్‌ఘాట్‌ లో నివాసముండేది. ప్రస్తుతం ఆమె అదే కంపెనీలో పనిచేస్తూ నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని మంత్రి సెలెప్టియా అపార్ట్‌మెంట్‌లో స్నేహితులతో కలిసి ఉంటోంది. కొన్ని రోజులుగా తనకు తన భర్తకు మధ‌్య చిన్న చిన్న గొడవలు రావడంతో ఆమె భర్తకు దూరంగా ఉండి జీవనాన్ని సాగిస్తోంది. భర్తతో ఉన్న కలహాల కారణంగానే ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు.

Hyderabad police have solved the mystery of the software engineer missing case

 

Latest Updates