హుక్కా కేంద్రంపై పోలీసుల దాడి…19మంది అరెస్ట్

హైదరాబాద్: హుక్కా నిర్వహిస్తున్న కేఫ్ పై దాడి చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. జూబ్లీ హిల్స్ రోడ్ నెండర్ 1లో జీషాన్ అనే అతను టైం కేఫ్ ను నడుపుతున్నాడు. అయితే కేఫ్ పై పోలీసులు రైడ్ చేయగా… హుక్కా సేవిస్తున్న 25మందిని గుర్తించారు పోలీసులు. దీంతో కేఫ్ ఓనర్ జిషాన్ తో పాటు అతని దగ్గర పనిచేస్తున్న 19మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. జిషాన్ పై ఇప్పటికే చాలా కేసులు ఉన్నట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. ప్రస్తుతం జిషాన్ పై పీడీ యాక్ట్ నమోదుచేసేందుకు పరిశీలిస్తున్నారు పోలీసులు.

Latest Updates