హైదరాబాద్ పోలీసులను ఆదర్శంగా తీసుకోవాలి

దిశ రేప్  కేసు నిందితులను హైదరాబాద్ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడంపై  ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం,బీఎస్పీ అధినేత్రి మాయావతి హర్షం వ్యక్తం చేశారు. దీంతో పాటు  యూపీ ప్రభుత్వం, పోలీసులపై విమర్శలు గుప్పించారు. తమ రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నప్పటికీ సర్కారు నిద్రపోతోందని ఆరోపించారు.

యూపీలో  రోజు రోజూకీ నేరాలు పెరిగిపోతున్నా ప్రభుత్వం ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాయావతి. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ పోలీసులు.. హైదరాబాద్ పోలీసులను చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నారు. ఉత్తరప్రదేశ్ లో జంగల్ రాజ్ కొనసాగుతోందన్న మాయావతి..ఇక్కడ నేరగాళ్లను అతిథులుగా చూస్తున్నారని ఆరోపించారు.

Latest Updates