జయరాం హత్య కేసు: హైదరాబాద్ కు నిందితుల తరలింపు

కోస్టల్‌ బ్యాంకు డైరెక్టర్‌ జయరాం హత్య  కేసులో.. నిందితులను హైదరాబాద్ తరలించడానికి నందిగామకు వెళ్లారు తెలంగాణ పోలీసులు. ఇందుకు నందిగామ కోర్టు జడ్జి అనుమతులు తీసుకోవడానికి వెళ్లగా.. వారు సెలవులో ఉండటం వల్ల జగ్గయ్యపేట కోర్ట్ ఇంచార్జ్ న్యాయమూర్తి అనుమతి కోసం జగ్గయ్య పేటకు వెళ్లారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఈ కేసులో రాకేశ్ రెడ్డి, శ్రీనివాసులు నిందితులుగా ఉన్నారు.

జయరాంను హత్య చేసి ఏపీ లో వదిలి వెళ్లారు నిందితులు. దీంతో ఏపీ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారించి ఇద్దరిని నిందితులుగా గుర్తించారు. ముందు నుండి కేసు విచారణలో పలు అనుమానాలను వ్యక్తం చేసింది జయరాం భార్య పద్మశ్రీ. రాకేశ్ రెడ్డి, శ్రీనివాసులుతో పాటు.. శిఖా చౌదరికి కూడా జయరాం హత్య లో భాగం ఉన్నట్లు ఆరోపించింది. ఏపీ పోలీసులు కావాలనే శిఖా చౌదరిని కేసు నుంచి తప్పించారని తెలిపింది. దీంతో పాటే..  హత్య జరిగింది తెలంగాణ లో అయితే ఏపీ పోలీసులు ఎలా విచారిస్తారని అన్నారు పద్మశ్రీ. ఇందుకు.. తెలంగాణ పోలీసులు వాచారణ చేపట్టాలని.. జూబ్లీహిల్స్ పోలీస్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేశారు. వివాదాలకు తావివ్వకుండా.. జయరాం హత్య కేసును తెలంగాణకు బదిలీ చేశారు ఏపీ పోలీసులు.

Latest Updates