మోడీ సభకు స్పెషల్ ప్రొటెక్షన్

Hyderabad Police tightened security for Modi meet in LB Stadium on Monday
  • ఎస్పీజీ కనుసన్నల్లో ఎల్బీ స్టేడియం
  • స్టేడియం పరిసరాల్లో పెరిగిన నిఘా
  • ఫేషియల్ రికగ్నేషన్ తో అనుమానితుల గుర్తింపు
  • కమాండ్ కంట్రోల్ సెంటర్నుం చి పర్యవేక్షణ
  • రెండు వేల మంది పోలీసులతో భద్రత

హైదరాబాద్ లో జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభకు ప్రత్యేక భదత్ర ఏర్పాట్లు చేశారు. చీమ చిటుక్కుమన్నా తెలుసుకునేలా రాష్ట్ర పోలీసులతో స్పె షల్ ప్రొటెక్షన్ గ్రూప్ బృందాలు సమన్వయం చేసుకుంటు న్నాయి. సీ పీ కార్యాలయంలోని కమాం డ్ కంట్రోల్ రూమ్ కు సీసీ కెమెరాలు కనెక్ట్​ చేసి ఫేషియల్ రికగ్నేషన్ తో అనుమానితులను గుర్తిస్తు న్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో 8మంది అదనపు డీసీపీలు, 16మంది ఏసీసీలు, 80 మంది ఇన్ స్పె క్టర్లు , 160 మంది ఎస్సైలతో సెక్యూరిటీ టైట్ చేశారు.

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రధాని మోడీ సభకు పోలీసులు పటిష్టమైన భద్రత కల్పిం చారు. మూడు రోజుల ముందు నుంచే స్పెషల్‌‌ ప్రొటెక్షన్‌‌ గ్రూప్‌ (ఎస్పీజీ)బృందాలు హైదరాబాద్ చేరుకున్నాయి. ఎస్పీజీ అధికారులతోపాటు కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ సెక్యూరి టీ ఏర్పాట్లు చేసింది. సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో సభ జరిగే ఎల్బీ స్టేడియాన్ని పోలీసులు ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీనికి రెండు వేల మంది అదనపు పోలీసులతో పాటు రెండు కంపెనీల కేంద్ర బలగాలను బందోబస్తులో వినియోగిస్తున్నారు.  ప్రధాని పర్యటన నేపథ్యంలో సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. సభ జరిగే పరిసర ప్రాంతాల్లోని నాంపల్లి రైల్వేస్టేషన్,లాడ్జిలతో పాటు అనుమానిత ప్రాంతాలపై నిఘా పెంచారు. ఎల్బీ స్టేడియంలోని ప్రవేశ మార్గాల్లో మెటల్ డిటెక్టర్లు , డోర్‌‌ఫ్రేమ్స్ ఏర్పాటు చేశారు.బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో స్టేడియంలో క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

స్టేడియం చుట్టూ ఉన్నబాబుఖాన్ ఎస్టేట్స్ తో పాటు అన్ని భవనాలను సోదా చేశారు. మరో వైపు ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాలను సీసీ కెమెరాల నిఘా నీడలోకి తీసుకొచ్చారు. స్టేడియం లోపల, బయట, ఎంట్రీ,ఎగ్జిట్ పాయింట్స్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సీపీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ కు కనెక్ట్ చేశారు. ఫేషియల్ రికగ్నేషన్ యాప్ ద్వారా పోలీస్ రికార్డ్స్ లో ఉన్న అనుమానితులను స్కాన్  చేయనున్నారు.

సెంట్రల్ జోన్ డీసీపీ పర్యవేక్షణ

సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్ పర్యవేక్షణలో 1500 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటు న్నారు. ఇందులో 8 మంది అదనపు డీసీపీలు, 16 మంది ఏసీపీలు, 80 మంది ఇన్స్పెక్టర్లతో పాటు 160 మంది ఎస్సైలు ప్రధాని సభ సెక్యూరిటీలో ఉంటారు. మరో 1000 మందికి పైగా కానిస్టేబుల్స్ డ్యూటీలో ఉండనున్నారు.స్టేడియాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న ఎస్పీజీ బృందం రాష్ట్ర పోలీసులకు సెక్యూరి టీ గైడ్ లైన్స్ ఇచ్చిం ది. స్టేజ్ పైకి వచ్చే నాయకుల వివరాలు సేకరించింది. స్టేడియం చుట్టూ ఉన్న బిల్డిం గ్స్ పై నుంచి కూడా బైనాక్యులర్స్ తో పోలీసులు నిఘా ఏర్పాట్లు చేసింది.

Latest Updates