కరోనా పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సూచనలు

హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా నగరంలోని రాచకొండ పీఎస్ పరిధిలో వాహనదారులకు కొన్ని సూచనలు చేశారు ట్రాఫిక్ పోలీసులు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ఆదేశాల మేరకు ఐదుగురు ట్రాఫిక్ పోలీసుల బృందం.. దిల్ సుఖ్ నగర్ లో రోడ్డుపైనే వాహనదారులకు వైరస్ పై అవగాహన కల్పించారు. ఎప్పటికప్పుడు చేతులను ఎలా శుభ్రం చేసుకోవాలో ప్రదర్శించి చూపించారు.

ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని,  చేతులను సబ్బుతో గానీ, శానిటైజర్ తో గానీ 20 సెకన్లకు మించకుండా కడుక్కోవాలని చెప్పారు. ప్రతీ వ్యక్తి.. మరో వ్యక్తితో మాట్లాడేటప్పుడు మీటరు దూరం ఉండాలని, షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్కారమే పెట్టాలని చెప్పారు. అదే విధంగా  తుమ్మేటప్పుడు, దగ్గేటప్పుడు మోచేతిని అడ్డుపెట్టుకోవాలని చూపించారు. కరోనా నివారించేందుకు అవకాశం ఉంది కాబట్టి ప్రతీ ఒక్కరూ శుభ్రత పాటించాలంటూ రాచకొండ ట్రాఫిక్ పోలీస్ తరపున విజ్ఞప్తి చేశారు.

Latest Updates