ప్లాట్ నుంచి విల్లాల వరకు..

హైదరాబాద్, వెలుగు:

దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటే… హైదరాబాద్ లో మాత్రం కొత్త కంపెనీలు, పెట్టుబడుల రాకతో… రియల్ రంగం దూసుకుపోతోంది. ఇప్పటికే ఆఫీస్ స్పేస్ లో బెంగళూరు, ఢిల్లీ వంటి మెట్రో పాలిటన్ సిటీలను దాటి హైదరాబాద్ టాప్ లో నిలిచింది. దానికి అనుగుణంగా ఉద్యోగ అవకాశాలూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రియల్ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతుండటంతో… హైదరాబాద్ రియల్ రంగం ఎవర్ గ్రీన్ హాట్ మార్కెట్ గానే నిలదొక్కుకోగలుగుతుంది. దీనికితోడు పెరుగుతున్న మౌలిక వసతులు, కొత్తగా వచ్చే పెట్టుబడులతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో మరో ఐదేళ్ల పాటు కొంగొత్త మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాణ ప్రాజెక్టులను కస్టమర్లకు  చేరువ చేసేలా క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో వేదిక కానుంది.

రియల్ ట్రెండ్ పై కస్టమర్లకు అవగాహన

సిటీలో పెట్టుబడులు పెంచేలా, కస్టమర్లకు భారీ ప్రాజెక్టులను పరిచయం చేసేలా వినూత్న రీతిలో క్రెడాయ్ ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. ఇప్పటికీ 8 ప్రాపర్టీ షోలను విజయవంతంగా పూర్తి చేయగా… తాజాగా క్రెడాయ్ హైదరాబాద్ చాఫ్టర్  మరో ప్రాపర్టీ షో కు సన్నాహాలు చేసింది. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు హైటెక్స్ లో జరిగే ఈ గ్రాండ్ రియల్ ఎస్టేట్ ఈవెంట్ లో ప్రముఖ బిల్డర్లు, డెవలపర్లే కాకుండే నిర్మాణ, అనుబంధ రంగ సంస్థలు భాగస్వామ్యం కానున్నాయి. సొంతింటిని కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదొక అవకాశం కానుండగా, రియల్ రంగంలో పెట్టుబడి పెట్టాలని భావించే వారికి కమర్షియల్, రెసిడెన్షియల్ సెగ్మెంట్లతోపాటు తాజాగా పెరిగిన కో వర్కింగ్ స్పేస్ పై కస్టమర్లకు ప్రాపర్టీ షో అవగాహన కల్పించనుంది. నిర్మాణదారులు, వినియోగదారులే కాకుండా బ్యాంకింగ్ సంస్థలను ఒకే వేదికపైకి తీసుకువచ్చేలా ఈ ప్రాపర్టీ షో జరగనుంది.  ఓపెన్ ప్లాటింగ్, కమర్షియల్ స్పేస్ తోపాటు, లగ్జరీ విల్లాలు, అపార్టుమెంట్లను ప్రదర్శించనున్నారు. సిటీలో నిర్మాణ దశ, రెడీ టు మూవ్ ప్రాజెక్టులను 80 స్టాళ్లలో దాదాపు 15వేల యూనిట్ల ప్రాపర్టీలు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి.

బడ్జెట్ కు తగినట్లుగా…..

సిటీలో సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునే వారికి క్రెడాయ్ ప్రాపర్టీ షోతో ఎంతగానో లబ్ధి చేకూరుతుంది. బడ్జెట్, లోకేషన్, అందించే సౌకర్యాలు, వసతులతోపాటు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు, లేటెస్ట్ ఆర్కిటెక్చర్ డిజైన్లు, ఇంటీరియల్ డిజైనింగ్ తోపాటు ఫైనాన్స్ అందించే సంస్థలన్నీ కూడా ఒకే దగ్గర ఉండటంతో… నచ్చిన విధంగా సొంతింటి కలల  సౌధాలను నిర్మించుకోవచ్చు. అదేవిధంగా రియల్ రంగంలో పెట్టుబడి పెట్టేవారికి అనువైన, తక్కువ ధరల్లో లభించే ప్రాజెక్టులను ఎగ్జిబిట్ చేయనున్నారు. దీంతో బడ్జెట్ లోనే హైరైజ్ అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు, ఇండిపెండెంట్ ఇళ్లు, ఓపెన్ ప్లాట్లను కొనుగోలు చేసేవారికి ఇదొక మంచి అవకాశం.

కమర్షియల్ స్పేస్ కు ఫుల్ డిమాండ్…

కమర్షియల్ స్పేస్ సెగ్మెంట్‌‌ లో హైదరారాబాద్ అన్ని మెట్రో నగరాల కంటే ముందుంది. ఏడాది కాలంలో 1.2 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆఫీస్ స్పేస్ వినియోగంలోకి రాగా, ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న బెంగళూరును దాటేసింది. మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు స్కోప్ ఉండటంతో రెండేళ్లలో కమర్షియల్ స్పేస్ కు ఫుల్ డిమాండ్ రానుంది. దీనికి తగినట్లుగానే రెసిడెన్షియల్ స్పేస్ కూడా పెరుగుతోంది. ప్రతి వంద చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ కు దాదాపు 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెసిడెన్షియల్ స్పేస్ క్రియేట్ కానుంది.

క్రెడాయ్ ప్రాపర్టీ షోలో ఆల్ట్రా లగ్జరీ ప్రాజెక్టులు…

ప్రస్తుతం రెసిడెన్షియల్, కమర్షియల్, ఓపెన్ ప్లాటింగ్ సెగ్మెంట్లు ఉండగా, కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా కో వర్కింగ్ స్పేస్, విశాలంగా ఉండే విలాసవంతమైన భవనాలు, ఇండిపెండెంట్ ఇళ్లను కొనుగోలు చేసేవారు ఎక్కువైపోయారు.  1200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఇళ్లను నిర్మించుకునే జనాలు కూడా ఆరు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే అపార్టుమెంట్లు, విల్లాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఖరీదైన భారీ ప్రాజెక్టులు ఊపందుకుంటున్నాయి. వీటిని ప్రమోట్ చేసేలా ప్రాపర్టీ షో దృష్టి పెట్టింది. వీటికితోడు ఇప్పుడిప్పుడే బెంగళూరు తరహాలో కో లివింగ్​సెగ్మెంట్ లో పెట్టుబడులపై ఆసక్తి చూపుతుండగా, మరో మూడేళ్లలో కార్పొరేట్ సంస్థలు ఇటువైపు వచ్చే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు మరింత ఊపు రానుంది.

Latest Updates