ఇళ్ల నిర్మాణంలో హైదరాబాద్ బెస్ట్

హైదరాబాద్, వెలుగు: సిటీలో రియల్ మార్కెట్ జోష్ కొనసాగుతోంది. ఏటా మారిపోతున్న ధరలు మార్కెట్ లో బయ్యర్లకు హై రిటర్న్స్ ఇస్తుంటే… పెట్టిన పెట్టుబడి ఒక్క ఏడాదిలోనే పెరుగుతోంది. అయితే కొత్తగా సొంతిల్లు కానీ, కమర్షియల్ స్పేస్ కొనుగోలు చేసేవారికి మాత్రం కాస్త ఇబ్బంది కలిగించినా గ్రాడ్యుయల్ గ్రోత్ నమోదవుతోంది. గ్లోబల్ సిటీ వైపు వడివడిగా అడుగులు వేస్తున్న హైదరాబాద్ లో రియల్ మార్కెట్ ఆశాజనకంగా ఉంది. దేశమంతటా రియల్ ఎస్టేట్ రంగంలో కాస్త అప్ అండ్ డౌన్ ట్రెండ్ నడుస్తుండగా… హైదరాబాద్ లో మాత్రం ఆశించిన దానికంటే వృద్ధి నమోదవుతుందనీ ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ ను రిలీజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 150 నగరాల్లో రెసిడెన్షియల్‌ సెగ్మెంట్‌లో క్యాపిటల్ వృద్ది నమోదవుతున్న జాబితాలో హైదరాబాద్ సిటీ 14 స్థానాన్ని దక్కించుకుందని చెప్పింది. ఈ జాబితాలో దేశంలోని 20 సిటీలకు చోటు దక్కగా ఢిల్లీ 73వ స్థానంలో, బెంగళూరు 94వ స్థానంలో, అహ్మదాబాద్ 108 స్థానాల్లో ఉన్నట్లు పేర్కొంది.

పుణెలో ఆశించిన వృద్ధి లేదు

రెసిడెన్షియల్ సెగ్మెంట్ లో భారీగా కొత్త ప్రాజెక్టులు రాకపోయినా… హైదరాబాద్ లో మాత్రం ఇన్వెంటరీ తగ్గుతూనే ఉంది. దీంతో కొత్త ప్రాజెక్టుల కంటే ఉన్న యూనిట్ల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. సిటీ రియల్ మార్కెట్ లో 9 శాతం మేర ఏటా వృద్ధి చెందుతుండగా… మహారాష్ట్రలోని పుణెలో ఆశించిన మేర వృద్ధి లేదని.. కేవలం 1.1 శాతం ఏటా పెట్టుబడి పెరుగుతోందని రిపోర్టులో పేర్కొంది.  ఈ తరహా గ్రోత్ హెల్దీలమార్కెట్ కు మేలు చేసేదే అయినా… కొత్తగా స్థిరాస్తిపై పెట్టుబడి పెట్టేందుకు కాస్త ఇబ్బందికరమేనని.. అయినా అపార్టుమెంట్లు, విల్లాలు కలిగినవారికి పెట్టుబడి తొమ్మిదింతలు పెరుగుతుందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.

Latest Updates