ముఠా అరెస్ట్ : హైదరాబాద్ లో విదేశీ యువతులతో వ్యభిచారం

హైదరాబాద్ : కొోన్ని రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. అమీర్ పేట్ లోని ఓ హోటల్‌లో విదేశీ యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారు. వీరిలో నలుగురు విదేశీ యువతులతో పాటు వెస్ట్ బెంగాల్‌ కు చెందిన మరో యువతి ఉంది. నలుగురు విటులను రెడ్ హ్యాండెడ్‌ గా పట్టుకున్నామని తెలిపారు SRనగర్ పోలీసులు. నలుగురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నామని.. ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నామని తెలిపారు.

అదుపులోకి తీసుకున్న యువతుల్లో నలుగురు ఉజ్బెగిస్థాన్‌ కు చెందిన వారని పోలీసులు తెలిపారు. SR నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదిత్యా పార్క్ హోటల్‌ లాడ్జ్‌ లో విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించామని పోలీసులు తెలిపారు. మంగళవారం (ఏప్రిల్ 2) ఉదయం నిర్వహించిన దాడుల్లో పలువురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. లాడ్జ్ పేరుతో సీక్రెట్ గా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఆదిత్యా లాడ్జ్‌ నిర్వహిస్తున్న ఇద్దరు అమ్మాయిలు, మేనేజర్‌ ను విచారించి, మరిన్ని వివరాలు సేకరించామని.. పంజాగుట్ట పరిధిలోని పోలో లాడ్జ్‌ లో దాడులు చేసి, మరి కొంత మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ సెక్స్ రాకెట్ వెనుక రాహుల్, సూర్య అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని.. దీని వెనుక ఎంతటి వారున్నా వదిలిపెట్టమని తెలిపారు పోలీసులు.

Latest Updates