ఉన్నావ్ నిందితులను హైదరాబాద్ తరహాలో ఎన్‌కౌంటర్

ఉన్నావ్ అత్యాచారం కేసులో నిందితురాలు 90 శాతం కాలిన గాయాలతో 43 గంటలపాటు మృత్యువుతో పోరాడి గుండెపోటుతో చనిపోయింది.ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. క్యాండిల్ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.

అంతేకాదు హైదరాబాద్ దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసినట్లుగా.. ఉత్తరప్రదేశ్ పోలీసులు ఉన్నావ్ కేసులో నిందితులను కూడా ఎన్‌కౌంటర్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.  ఉన్నావ్ బాధితురాలి మృతి తర్వాత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఉన్నావ్ లో యువతిపై సామూహిక అత్యాచారం చేసిన ఐదుగురు నిందితులు బెయిలుపై జైలు నుంచి బయటకు వచ్చారు. ఇదే కేసుపై రాయబరేలీ కోర్టుకు వెళ్తున్న బాధితురాలిని అడ్డుకొని కిరోసిన్ పోసి నిప్పంటించి పారిపోయారు. బాధితురాలిని సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి తరలించడంతో అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయింది. దీంతో ఆ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.

Latest Updates