ఐటీ ఉద్యోగులు .. ఓటుకు దూరం

Hyderabad Techies not participating in lok sabha Elections
  • నగరంలో 5 లక్షల మంది టెకీలు
  • రాష్ట్రానికి చెందిన వారు లక్షకు పైనే

ఓటు వజ్రాయుధం. ఓటు విలువ వెలకట్టలేనిది. ఓటు హక్కుని వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుదామంటూ.. నినాదాలిచ్చే విద్యావంతులు చాలామంది  ఈసారి పోలింగ్ కు దూరంగా ఉన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఐటీ ఉద్యోగుల ఓటు హక్కు వినియోగించుకోని విషయం స్పష్టమవుతుంది. ఎందుకంటే కొన్ని కంపెనీలు ఉద్యోగులకు సెలవు ఇవ్వకపోవటం కారణంగా తెలుస్తోంది. కొంతమందికి సెలవు దొరికినా ఓటింగ్ కు దూరంగా ఉన్నారు.

హైదరాబాద్, వెలుగు: ఐటీ రంగానికి కేంద్రంగా ఉన్న హైదరాబాద్ నగరంలో ఓటు హక్కు ఉన్న టెకీల సంఖ్య దాదాపు 5 లక్షల పైనే ఉంటుంది. ఇందులో 3.5లక్షల మంది ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన వారైతే, మిగతా లక్ష మంది రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు చెందిన వారుంటారు. మిగతా 50వేల మంది సిటీకి చెందినవారనీ  ఐటీ ఉద్యోగ సంఘాల లెక్కలు చెబుతున్నాయి. అయితే రాష్ట్రం లో జరిగే ఏ ఎన్ని కలైన వీరి భాగస్వామ్యం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది.  మేథావి వర్గంగా భావించే ఐటీ ఉద్యోగులు సమాజ హితాన్ని కోరుకుంటున్నా.. భాగస్వామ్యం కాకుండానే దూరంగా ఉంటున్నారు . దాంతో ఓటేసినవారి సంఖ్య 10శాతం కూడా దాటలేదు అన్నది స్పష్టమవుతోంది. గ్రేటర్ పరిధిలో 4 లోక్ సభ స్థానాలుండగా, ఎక్కువగా మల్కాజ్ గిరి, చేవెళ్ల పరిధిలో ఉండే కాలనీల్లో ఐటీ ఎంప్లాయీస్ నివాసం ఉంటారు. వీరిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కొందరైతే, ఇక్కడే ఉద్యోగం పొంది స్థిర నివాసం పొందిన వారు ఉన్నారు . నిత్యం బిజీ షెడ్యూల్ ఒత్తిడిలో గడిపే ఐటీ ఉద్యోగులు, వారంలో దొరికే రెండ్రోజుల సెలవులో సాధారణ పనులు, కుటుంబంతో సరదాగా గడిపేందుకు ఆసక్తి చూపుతారు కానీ, కానీ ఓటింగ్ లో మాత్రం పాల్గోవడం లేదని తెలుస్తోంది.

ఆసక్తి చూపని ఐటీ ఎంప్లాయీస్

‘హాలీడే ఫర్ ఓటింగ్’ అంటూ ఎలక్షన్ కమిషన్(ఈసీ)తో పాటు కార్మిక శాఖ పోలింగ్ రోజున పెయిడ్ హాలీడే ప్రకటించాలని ఆయా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసిం ది. అయినా ఓటింగ్ లో  ఐటీ ఎంప్లాయీస్ పాల్గొనలేదని తెలుస్తోంది. కొన్ని కార్పొరేట్ సంస్థలు ఎమర్జెన్సీ సేవలుగా పరిగణిస్తూ సెలవు ఇవ్వకపోవడమే కారణమంటున్నారు అధికారులు.  ఈసీ నిబంధనల ప్రకారం ఎమర్జెన్సీ సేవలకు ఎలాంటి సెలవు వర్తించదనీ చెబుతుండగా, ఇదే సాకు చూపుతూ హాలీడే ఇవ్వకుండా తప్పించుకుంటున్నాయి ఐటీ కంపెనీలు. దీంతో కొంతమంది ఐటీ ఉద్యోగులు ఓటేయాలనే ఆసక్తి ఉన్నా.. వ్యయ ప్రయాసలు భరించి ఓటేయడం ఎందుకులే అని లైట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోం ది. వాస్తవానికి రెండ్రోజులు సెలవు దొరికిందంటే ఎంచక్కా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి టూర్లు, పార్టీలతో ఎంజాయ్ చేసే లైఫ్ స్టెయిల్ కు ఐటీ ఎంప్లాయీస్ అలవాటు పడ్డారు.ఈసారి వారం మధ్యలో పోలింగ్ జరగడంతో సెలవు తీసుకున్నా.. వీకెండ్ లో పనిచేయాలనే నిబంధనల కారణంగా చాలా మంది ఓటు వేసేందుకు ముందుకురాలేదని సమాచారం.

అడ్రస్ ప్రూఫ్ గా ఓటర్ ఐడీ

చాలామంది సొంత రాష్ట్రా ల్లో ఓటు హక్కు కలిగి ఉన్నప్పటికీ హైదరాబాద్ లోనూ ఎన్ రోల్ చేసుకోవడమో, లేదా అడ్రస్ మార్చు కోవడంతో ఇక్క డ ఓటర్లుగా నమోదవుతున్నారు . దీంతో ఓటర్ల సంఖ్య పెరుగుతున్నా ఓటింగ్ శాతం మాత్రం పెరగడం లేదు. ఇక్కడ ఓటర్ ఐడీని తీసుకున్న వారంతా కేవలం అదొక అడ్రస్ ప్రూఫ్ గా మాత్రమే భావిస్తున్నారని అధికారులంటున్నారు . గచ్చిబౌలిలో పనిచేసే ఐటీ ఉద్యోగి సిటీలో గంటలతరబడి క్యూలో నిలబడి ఓటేసేందుకు ముందుకు రావడం లేదు. దాంతో కూడా ఓటింగ్ శాతం తగ్గుతున్నట్టు అధికారులు భావిస్తున్నారు .

పోస్టల్ బ్యాలెట్ అవకాశమివ్వాలి

ప్రభుత్వం ఉద్యోగులకు ఇస్తున్నట్టుగానే ఐటీ ఉద్యోగులు, ఇతర పనుల్లో ఉన్నవారికి కూడా పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఇవ్వాలి. దాంతో పోలింగ్ పర్సంటేజ్ తప్పకుండా పెరుగుతుంది. ఈ విషయాన్ని అసెంబ్లీ ఎన్నికలప్పుడే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం. కార్పొరేట్ కంపెనీలు కూడా హాలీడే ఫర్ ఓట్ ని బంధన పాటించడం లేదు. అందుకే ఓటు వేయలేకపోతున్నాం.

– సందీప్ మక్తాలా,

ఐటీ ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్

Latest Updates