కే‌టి‌ఆర్ కు ట్వీట్ చేసిన సమస్య తీరడంలేదు

హైదరాబాద్ :  నాగోల్ డివిజన్ పరిధిలోని బృందావన కాలనీలో ఇంకా వరద ఉధృతి తగ్గలేదు. రోడ్లపై మొత్తం నాచు ఏర్పడటంతో కిందపడి గాయపడుతున్నట్టు స్థానికులు చెప్పారు. ఇదే విషయంపై కే‌టి‌ఆర్ కు ట్వీట్ చేసిన సమస్య తీరడంలేదన్నారు. ఇప్పటివరకు నలుగురికి గాయాలవగా…. ఓ వృద్ధుడు ప్రాణా పాయం నుంచి బయటపడ్డాడు. 20రోజులుగా ఇదే పరిస్థితి ఉందంటున్నారు కాలనీవాసులు. ఏ అధికారి, నాయకుడూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో  నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉందంటున్నారు బృందావన్ కాలనీ జనం.

Latest Updates