కార్ పూలింగ్ తో ట్రాఫిక్ కంట్రోల్..

హైదరాబాద్: కార్ పూలింగ్ తో నగరంలోని ట్రాఫిక్ తగ్గుతుందని అన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనిల్ కుమార్. హైదరాబాద్ లోని బేగంపేట్ బ్లాక్ నైట్ కంపెనీలో  సిటీ ట్రాఫిక్ పోలీస్, క్విక్ రైడ్ ఆధ్వర్యం లో నిర్వహించిన కార్యక్రమానికి అనిల్ కుమార్ చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు. కార్ పూలింగ్, బైక్ పూలింగ్ యాప్ ద్వారా సిటీ లో ట్రాఫిక్ రద్దీ ని తగ్గించవచ్చని తెలిపారు అనిల్ కుమార్.  క్విక్ రైడ్ తో,  కార్ బైక్ పూల్ తో మనీ సేవ్ చేసుకోవచ్చని తెలిపారు. 5 లక్షల నుంచి 6 లక్షల వరకు వెహికల్స్ ప్రతి రోజు సిటీలో కి వస్తున్నందున ట్రాఫిక్ సమస్యలు ఎదురరవుతున్నాయని అన్నారు.  కార్ పూలింగ్ తో  పొల్యూషన్ తగ్గడంతో పాటు వెహికల్స్ తగ్గుతాయని చెప్పారు.

కార్ పూలింగ్ బెంగుళూరు, ఢిల్లీ, ముంబై లో అమలులో ఉందని అన్నారు అనిల్ కుమార్. ప్రతి సంవత్సరం చాలా మంది స్టూడెంట్స్, యువతి,యువకులు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని… బైక్ పై వెళ్తున్నపుడు తప్పనిసరిగా హెల్మెట్, కారులో వెళ్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్పారు. సిటీని యాక్సిడెంట్ ఫ్రీగా చేయడానికి . ప్రతీ ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి సీపీ అనిల్ కుమార్ తో పాటు..  ట్రాఫిక్ డీసీపీ చౌహన్, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Latest Updates