హైదరాబాదీలకు అలర్ట్: ఆగస్టు 18 నుంచి KBR పార్క్ రూట్లో వన్ వే...

హైదరాబాదీలకు అలర్ట్: ఆగస్టు 18 నుంచి KBR పార్క్ రూట్లో వన్ వే...

హైదరాబాదీలకు కీలక అలర్ట్ జారీ చేశారు ట్రాఫిక్ పోలీసులు. ఆగస్టు 18 నుంచి కేబీఆర్ పార్కు చుట్టూరా వన్ వే అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.కేబీఆర్ పార్క్ చుట్టూరా  అండర్ పాస్, ఫ్లైఓవర్ ల నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు ట్రాఫిక్ పోలీసులు. అండర్ పాస్, ఫ్లైఓవర్ ల నిర్మాణం పూర్తయ్యేంత వరకు వన్ వే అమల్లో ఉంటుందని తెలిపారు.

ఈ రూట్లో  వన్ వే కోసం ఇప్పటికే నిర్మాణాలు పూర్తిచేశారు పోలీసులు. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి పంజాగుట్ట వైపు ఉన్న రెండు రోడ్లలో ట్రాఫిక్ ని అనుమతిస్తామని... కేబీఆర్ పార్క్ చుట్టూ రెండ లైన్లలో వన్ వే ట్రాఫిక్ మాత్రమే అనుమతిస్తామని తెలిపారు పోలీసులు. 

ఈ మేరకు గతంలో వన్ వే ట్రైల్ రన్ కూడా నిర్వహించారు పోలీసులు. ట్రైల్స్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు పూర్తి స్థాయిలో వన్ వే అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ట్రాఫిక్ ఆంక్షలు దృష్టిలో ఉంచుకొని ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు ప్లాన్ చేసుకోవాలని... అండర్ పాస్ ఫ్లైఓవర్ల నిర్మాణం పూర్తయ్యేవరకు పోలీసులకు సహకరించాలని సూచించారు.

వన్ వే అమలుతో ట్రాఫిక్ ఫ్రీ అవుతుందని... లాంగ్ జర్నీ అయినప్పటికీ వాహనాలు ఎక్కడా ఆగకుండా వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు పోలీసులు. ఎమర్జెన్సీ సర్వీస్ వెహికల్స్ రాకపోకల విషయంలో ఆంక్షల సడలింపు ఉంటుందని తెలిపారు. కేబీఆర్ పార్క్ దగ్గర వాకర్స్ రోడ్డు దాటేందుకు తగిన ఏర్పాట్లు చేశామని... వాకింగ్ వచ్చేవారు వాహనాలు రోడ్లపై వాహనాలు నిలిపేందుకు వీల్లేదని తెలిపారు పోలీసులు.