నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌

కూకట్‌ పల్లి, వెలుగు: రోడ్డుపై దొరికిన
పర్సును బాధిత మహిళకు అప్పగించి
నిజాయితీ చాటుకున్నాడు ఓ ట్రాఫిక్
పోలీస్‌. కూకట్‌ పల్లి హౌసింగ్ బోర్డు
ఫేజ్9 వద్ద నివాసముండే పద్మజ
షాపింగ్ కోసం ఆదివారం స్కూటీపై
ఫోరం మాల్‌‌కు వచ్చింది. ఆమె పర్సు
అక్కడ రోడ్డుపై పడిపోయింది. అక్కడే
పనిచేస్తున్న హెడ్​కానిస్టేబుల్ బ్రహ్మచారి రోడ్డుపై ఉన్న పర్సును గమనించాడు.
అందులోని ఫోన్ నంబరు ఆధారంగా ఆ మహిళకు ఫోన్​చేశాడు. పర్సు విషయం చెప్పగానే ఆమె పరుగు పరుగున వచ్చింది. రోడ్డు పక్కన పడిన తన పర్సును ఫోన్ చేసి మరీ ఇవ్వడంతో ఆయనకు థ్యాంక్స్ చెప్పింది. ఆ పర్సులో రూ.5వేల నగదు ఉంది.

Latest Updates