యంగ్ హీరోకు ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీసులు

hyderabad-traffic-police-impose-fines-naga-shourya-vehicle

హైదరాబాద్‌ : హీరో నాగశౌర్యకు ట్రాఫిక్‌ పోలీసులు ఫైన్ వేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో ఆయన తన కారు అద్దాలకు బ్లాక్‌ ఫిల్మ్‌ వేసుకొని ప్రయాణిస్తున్నారు. దీన్ని గమనించిన పంజాగుట్ట ట్రాఫిక్‌ పోలీసులు రూ. 500ల ఫైన్‌ విధించారు. తర్వాత కారు అద్దాలకు ఉన్న బ్లాక్‌ ఫిల్మ్‌ ను తొలగించారు. భారత్‌ లో కారు అద్దాలకు బ్లాక్‌ ఫిల్మ్‌ వాడటంపై నిషేధం ఉంది.  ప్రస్తుతం నాగశౌర్య సొంత బ్యానర్‌ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు.

Latest Updates