బీజేపీ సభకు వచ్చే వెహికల్స్‌‌‌‌కు రూట్ మ్యాప్స్‌‌‌‌

బీజేపీ సభకు వచ్చే వెహికల్స్‌‌‌‌కు రూట్ మ్యాప్స్‌‌‌‌
  • బీజేపీ సభకు వచ్చే వెహికల్స్‌‌‌‌కు రూట్ మ్యాప్స్‌‌‌‌
  • భారీ వాహనాలకు ఒకచోట, కార్లకు మరో చోట పార్కింగ్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: పరేడ్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌లో జరగనున్న బీజేపీ బహిరంగ సభకు వచ్చే వాహనాల పార్కింగ్‌‌‌‌ కోసం 20 ప్రాంతాలను ఎంపిక చేశారు. బస్సులు, డీసీఎం వ్యాన్లు వంటి భారీ వాహనాలకు ఒకచోట, కార్లకు మరో చోట పార్కింగ్‌‌‌‌ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాలన్నీ సభ ప్రాంగణానికి 3 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. నడక మార్గంలోనే పార్కింగ్ ఏరియా నుంచి సభ ప్రాంగణానికి చేరుకోవాల్సి ఉంటుంది. కరీంనగర్‌‌‌‌‌‌‌‌, సిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల నుంచి రాజీవ్ రహదారి మీదుగా వచ్చే భారీ వాహనాలను హాకీ గ్రౌండ్‌‌‌‌, బోయిన్‌‌‌‌పల్లి మార్కెట్‌‌‌‌లో పార్కింగ్‌‌‌‌ చేసుకోవాలి. ఇదే రూట్‌‌‌‌లో వచ్చే కార్లను సెంటెనరీ స్కూల్‌‌‌‌లో పార్కు చేయాలి. ఆదిలాబాద్‌‌‌‌, నిర్మల్‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌, కామారెడ్డి, మెదక్‌‌‌‌, సంగారెడ్డి నుంచి ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ 44, ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ 65 మీదుగా వచ్చే భారీ వాహనాలను బైసన్‌‌‌‌ పోలో గ్రౌండ్‌‌‌‌లో(ఎన్‌‌‌‌సీసీ గ్రౌండ్‌‌‌‌) పార్కింగ్ ఏర్పాటు చేశారు. అదే రూట్‌‌‌‌లో వచ్చే కార్లను క్లాసిక్ గార్డెన్స్‌‌‌‌, లీ రాయల్ ప్యాలెస్‌‌‌‌లో పార్క్ చేసుకోవచ్చు.

రంగారెడ్డి, నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌, అచ్చంపేట నుంచి శ్రీశైలం రోడ్డు(ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ 765) మీదుగా వచ్చే భారీ వాహనాలకు, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట నుంచి ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ 65 మీదుగా వచ్చే వెహికల్స్‌‌‌‌కు, వరంగల్, యాదాద్రి జిల్లా నుంచి వచ్చే భారీ వాహనాలకు రైలు నిలయం గ్రౌండ్‌‌‌‌, తార్నాకలోని రైల్వే డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌‌‌‌లను కేటాయించారు. ఇవే రూట్లలో వచ్చే కార్లకు క్లాసిక్ గార్డెన్స్‌‌‌‌, లీరాయల్ ప్యాలెస్‌‌‌‌, క్లాక్‌‌‌‌ టవర్ దగ్గరలోని ఎస్‌‌‌‌వీఐటీ గ్రౌండ్స్‌‌‌‌, మహబూబ్‌‌‌‌ కాలేజీ గ్రౌండ్స్‌‌‌‌లో స్థలం కేటాయించారు. రంగారెడ్డి, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, వికారాబాద్‌‌‌‌ నుంచి ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ 44 మీదుగా వచ్చే భారీ వాహనాలను సంజీవయ్య పార్క్‌‌‌‌, బుద్ధ భవన్‌‌‌‌, నెక్లెస్‌‌‌‌ రోడ్డు, నల్లగుట్ట వద్ద పార్కింగ్‌‌‌‌కు ఏర్పాటు చేశారు. ఇదే రూట్‌‌‌‌లో వచ్చే కార్లను వెస్లీ కాలేజ్‌‌‌‌, వెస్లీ స్కూల్‌‌‌‌ వద్ద పార్కు చేసుకోవాలి. హైటెక్‌‌‌‌ సిటీ, మాదాపూర్, ఎస్ఆర్‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌ పంజాగుట్ట నుంచి పరేడ్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌కు వచ్చే భారీ వాహనాలకు ఎన్టీఆర్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌లో, కార్లకు వెస్లీ స్కూల్ పార్కింగ్ కేటాయించారు.