గేమింగ్ స్టార్టప్లకు సాయం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: గేమింగ్‌‌‌‌, వీఎఫ్‌‌‌‌ఎక్స్‌‌‌‌, ఏఐ ఇండస్ట్రీలోని స్టార్టప్‌‌‌‌లకు ఊతమిచ్చేలా సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీ పార్క్స్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇండియా(ఎస్‌‌‌‌టీపీఐ) హైదరాబాద్‌‌‌‌లో ఇమేజ్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఎక్స్‌‌‌‌లెన్స్‌‌‌‌(సీఓఈ)ని ఏర్పాటు చేసింది.  ఈ సెంటర్‌‌‌‌‌‌‌‌ను తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్‌‌‌‌ రంజన్‌‌‌‌ సోమవారం ప్రారంభించారు. దీనితో పాటు ఎస్‌‌‌‌టీపీఐ–ఇమేజ్‌‌‌‌ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ను లాంచ్‌‌‌‌ చేశారు.  ప్రతి ఏటా 25–30 స్టార్టప్‌‌‌‌లను ఎంచుకొని వారికి మెంటారింగ్‌‌‌‌, ఫండింగ్‌‌‌‌ వంటి అంశాలలో తోడ్పాటును ఈ సెంటర్‌‌‌‌‌‌‌‌ అందిస్తుంది. ఇమేజ్‌‌‌‌ సీఓఈ ద్వారా వచ్చే ఐదేళ్లలో 140 స్టార్టప్‌‌‌‌లకు హెల్ప్‌‌‌‌ చేయాలని ఎస్‌‌‌‌టీపీఐ ప్లాన్స్‌‌‌‌వేస్తోంది. దేశంలో 21 సీఓఈలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు వేసుకున్నామని, ఇందులో ఇప్పటికే ఏడు సీఓఈలను ప్రారంభించామని ఎస్‌‌‌‌టీపీఐ డైరక్టర్‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌ ఓమ్కార్‌‌‌‌‌‌‌‌ రాయ్‌‌‌‌ అన్నారు.
ఈ నెంబర్‌‌‌‌‌‌‌‌ను 28కి పెంచుతామని తెలిపారు. టైర్‌‌‌‌‌‌‌‌2  సిటీలలో కూడా సీఓఈలను ఏర్పాటు చేసి, స్టార్టప్‌‌‌‌లకు తోడ్పాటు అందిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా 11 నెక్స్ట్‌‌‌‌ జనరేషన్‌‌‌‌ ఇంక్యుబేషన్‌‌‌‌ సెంటర్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. విజయవాడలో కూడా ఇటువంటి సెంటర్‌‌‌‌‌‌‌‌ను వచ్చే మూడు నెలల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. సీఓఈలను ఏర్పాటు చేయడంలో పరిమితులు లేవని, కొలాబరేటర్స్‌‌‌‌ దొరికితే హైదరాబాద్‌‌‌‌లోనే మరొకటి ప్రారంభిస్తామన్నారు. మినిస్ట్రీ ఆఫ్‌‌‌‌ ఎలక్ట్రానిక్స్‌‌‌‌, ఇన్ఫర్మేషన్‌‌‌‌ టెక్నాలజీ(మైటీ) కింద ఎస్‌‌‌‌టీపీఐ పనిచేస్తున్న విషయం తెలిసిందే.  తెలంగాణ వీఎఫ్‌‌‌‌ఎక్స్‌‌‌‌, యానిమేషన్‌‌‌‌ అండ్‌‌‌‌ గేమింగ్‌‌‌‌ అసోషియేషన్‌‌‌‌(త్వాగా), హైదరాబాద్‌‌‌‌ ఏంజిల్స్‌‌‌‌, హైసీ, ఐఐఐటీ–హైదరాబాద్‌‌‌‌, టై హైదరాబాద్‌‌‌‌తో  ఎస్‌‌‌‌టీపీఐ ఎంఓయూలను కుదుర్చుకుంది. ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌ సపోర్ట్‌‌‌‌, మెంటారింగ్‌‌‌‌, టెక్నాలజీ, ఫండింగ్‌‌‌‌ వంటి రిసోర్సులను స్టార్టప్‌‌‌‌లకు అందించేందుకు ఈ ఎంఓయూలు తోడ్పడతాయని రాయ్‌‌‌‌ అన్నారు. తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్‌‌‌‌ రంజన్‌‌‌‌ మాట్లాడుతూ హైదరాబాద్‌‌‌‌లో గేమింగ్‌‌‌‌ ఇండస్ట్రీ వేగంగా డెవలప్‌‌‌‌ అవుతోందని తెలిపారు.
సీఓఈని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఇదొక కారణమని అన్నారు. గత రెండు దశాబ్దాలలో దేశంలో గేమింగ్‌‌‌‌ ఇండస్ట్రీ ఎలా డెవలప్‌‌‌‌ అయ్యిందో చూశానని త్వాగా అధ్యక్షుడు రాజీవ్‌‌‌‌ చిల్కా అన్నారు. ఇండియాలో గేమింగ్‌‌‌‌ ఇండస్ట్రీ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటోందని తెలిపారు.
ఈ కార్యక్రమానికి హైసీ చీఫ్‌‌‌‌ ఆపరేటింగ్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ శ్రీనివాసరావు, ఐఐఐటీ హైదరాబాద్‌‌‌‌ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ రమేష్‌‌‌‌ లోకనాథన్‌‌‌‌, ఇమేజ్‌‌‌‌ సీఓఈ చీఫ్‌‌‌‌ మెంటర్‌‌‌‌‌‌‌‌ శశిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇమేజ్‌‌‌‌ సీఓఈకి అప్లయ్‌‌‌‌ చేయాలనుకునే స్టార్టప్‌‌‌‌లు ఇమేజ్‌‌‌‌.ఎస్‌‌‌‌టీపీఐ.ఇన్‌‌‌‌ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో లాగిన్‌‌‌‌ అవ్వాలి. అప్లికేషన్లు 17–02–2020 నుంచి 30–02–2020 వరకు తీసుకుంటారు. అర్హమైన స్టార్టప్‌‌‌‌లను ఆ అప్లికేషన్స్‌‌‌‌ నుంచి ఎంపిక చేస్తారు.

ఎస్‌‌టీపీఐ ఎగుమతులు 10% పెరుగుతాయ్‌‌

ఎస్‌‌టీపీఐ ఎగుమతులు 2018–19 లో రూ. 4.24 లక్షల కోట్లుగా ఉన్నాయని, ఇవి 2019–20 లో 10 శాతం వృద్ధిని నమోదు చేస్తాయని ఓమ్కార్‌‌‌‌ రాయ్‌‌ అన్నారు. ఎగుమతుల పరంగా చూస్తే.. ఎస్‌‌టీపీఐ సెప్టెంబర్‌‌‌‌ నెల డేటాతో మా అంచనాలు సరిపోయాయని తెలిపారు. దేశంలో మొత్తం సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ ఎగుమతులు రూ. 10.49 లక్షల కోట్లకు చేరుకున్నాయని నాస్‌‌కామ్‌‌ ప్రకటించిన డేటా వాస్తవంగా ఉందన్నారు. ఇండియాను సాఫ్ట్‌ వేర్‌‌‌‌ ప్రొడక్ట్‌‌ దేశంగా మార్చడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు.

Latest Updates