ఐడియా అదిరింది..మీరూ ట్రై చేయండంటున్న నెటిజన్లు

హైదరాబాద్ లో భారీ వర్షాలు, వరదల కారణంగా రోడ్లు తెగిపోతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోవడంతో నదుల్ని తలపిస్తున్నాయి. మరోవైపు మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజల్ని వర్షాల నుంచి రక్షించేందుకు 80మందికి పైగా అధికారుల్ని నియమించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

అయితే ఇటీవల వరదల వల్ల నీటి ప్రవాహానికి  కార్లు, ద్విచక్రవాహనాలు కొట్టుకొని పోతున్నాయి. మరోమారు ఇలా వాహనాలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వాహనదారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సౌత్ స్వరూప్ కాలనీ ఉప్పల్ కి చెందిన ఓ వ్యక్తి కారును ఇంటిబయట పార్క్ చేశాడు. రోప్ సాయంతో కారు నీటి ప్రవాహానికి మునిగిపోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. నగర వాసులు ఇలా తమ కార్లను భద్రపరచుకోవచ్చంటూ కామెంట్ చేస్తున్నారు.

Latest Updates