మురికి నీటి నియంత్రణపై వాటర్ బోర్డు ఫోకస్


మోడ్రనైజేషన్, నిర్మాణానికి వాటర్ బోర్డు ప్లాన్​

తొలి దశలో 200 ఎంఎల్‌‌‌‌డీల కెపాసిటీతో నిర్మాణం

ఆ తర్వాత నాలాల వెంబడి నిర్మించేందుకు ప్లాన్​

హైదరాబాద్, వెలుగు : చెరువులు, కుంటలు, నాలాల్లో కలుస్తున్న మురుగు నీటి నియంత్రణకు వాటర్ బోర్డు ఫోకస్​ పెట్టింది. ఇందులో భాగంగా వాటర్ బాడీస్ లోకి నేరుగా మురికి నీళ్లు కలవకుండా ఇప్పటికే ఉన్న  ప్రాంతాల్లో మోడ్రనైజేషన్, కొత్తగా నిర్మాణానికి చర్యలు చేపట్టింది. తొలిదశలో 200 ఎంఎల్డీల సామర్థ్యంతో మురుగు నీటి ట్రీట్ మెంట్ ప్లాంట్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.  సిటీలో సీవరేజీ మాస్టర్ ప్లాన్ లో భాగంగా నాలాలు, చెరువులు, కుంటలతో పాటు మూసీ వెంబడి నేరుగా మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థాలు కలవకుండా ఎస్టీపీల నిర్మాణం చేయాల్సి ఉంది. ఇప్పటికే 1200ఎంఎల్డీల మురుగు నీరు ఉత్పత్తి అవుతుండగా కేవలం 600–700 ఎంఎల్డీల సీవరేజీ వాటర్ మాత్రమే క్లీన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎస్టీపీల సామర్థ్యం మరింత పెంచేందుకు నూతన ఎస్టీపీల నిర్మాణం, ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు.

తొలి దశలో 200 ఎంఎల్డీల ఎస్టీపీలు

మాస్టర్ ప్లాన్ ప్రకారం సిటీలో 50 ఎస్టీపీలను కొత్తగా నిర్మించాలనే అంచనాలు ఉండగా, రోజుకు 3500 ఎంఎల్డీల మురుగునీటిని ఫిల్టర్ చేసేందుకు వీలు కలుగనుంది. ఈ నేపథ్యంలో తొలి దశలో 200 ఎంఎల్డీల సామర్థ్యం కలిగిన ఎస్టీపీలను అందుబాటులోకి తీసుకువచ్చి, దశల వారీగా మాస్టర్ ప్లాన్ అమలు చేయనున్నట్లుగా వాటర్ బోర్డువర్గాలు చెబుతున్నాయి. ఈ కొన్ని ప్రాంతాల్లోనూ శేరిలింగంపల్లిలోని లింగంకుంటలోని ఎస్టీపీని మోడ్రనైజేషన్​కు చర్యలు చేపట్టారు. ఆ తర్వాత పారిశ్రామిక వ్యర్థాలు ఎక్కువగా కలిసే నాలాలపై ఏర్పాటు చేయనుండగా, మూసీ పరివాహక ప్రాంతంలోనూ నూతన ఎస్టీపీల నిర్మాణం జరుగుతుందని అధికారులు తెలిపారు.

డిజిటల్ ఫ్లో మీటర్లు

ఎస్టీపీలను చేరే  ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను ఆన్ లైన్ ద్వారా తెలుసుకునేందుకు ఇప్పటికే 20 ఎస్టీపీల వద్ద డిజిటల్ ఫ్లో మీటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. దీని ద్వారా రోజు వారీగా సిటీ నలుమూలల నుంచి వచ్చే సీవరేజీ నీటి సామర్థ్యాన్ని పక్కాగా లెక్కించేందుకు అవకాశం ఉంది. ఈ మీటర్ల సాయంతో ఎప్పటికప్పుడూ సీవరేజీ ట్రీటింగ్ ప్రక్రియను అంచనా వేసేందుకు వీలు కానుంది. గతేడాదిలోనే టెండర్ నోటిఫికేషన్ ముగిసింది.

ఇవి కూడా చదవండి..

చదలవాడ హేమేశ్​కు బాల పురస్కార్

ఆరున్నరేళ్లుగా పెద్దసార్లను మార్చట్లె!

ప్రాణహిత ప్రవాహం తగ్గింది.. యాసంగికి నీళ్లెట్ల..?

పీహెచ్‌‌‌‌సీ నుంచే పెద్ద డాక్టర్‌‌‌‌కు చూపెట్టుకోవచ్చు

 

 

Latest Updates