హైదరాబాద్ యువత అప్పులు ఎక్కువ చేస్తుండ్రు

రుణాలు అధికంగా తీసుకుంటున్న వారిలో హైదరాబాద్ యువత రెండో స్థానంలో ఉంది. తొలిస్థానంలో బెంగళూరు ఉందని రుణాలిచ్చే సంస్థ ‘క్యాష్ ఈ’తన నివేదికలో వెల్లడించింది. వైద్య ఖర్చులు, ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోళ్లకు యువత ఎక్కువ రుణాలు తీసుకుంటున్నారని తెలిపింది. తమ యాప్‌పై రుణాలు పొందుతున్న మహిళలు 10 శాతం మాత్రమే ఉన్నారంది. మొత్తం రుణాల్లో 31 నుంచి 38 ఏళ్ల మద్య ఉన్న యువత వాటా 52 శాతంగా ఉందని చెప్పింది. అధిక రుణాలు తీసుకుంటున్న నగరాల్లో గత సంవత్సరం ముంబై మొదటి ప్లేస్‌లో ఉంది. కానీ, ఈ సంవత్సరం మాత్రం బెంగుళూరు.. ముంబైని కాదని మొదటి ప్లేస్‌ను ఆక్రమించింది. హోమ్ లోన్, పర్సనల్ లోన్లు ఎక్కువగా తీసుకుంటున్న వారిలో బెంగుళూరు తర్వాత హైదరాబాద్ నిలిచింది. హైదరాబాద్ యువతలో 25 వేల నుంచి 50 వేల మధ్య సంపాదించేవారు ఈ లోన్ల వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని తెలిపింది. ఈ లోన్లను ఆరు నుంచి నెలల్లో వాయిదా పద్దతుల్లో చెల్లించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

Latest Updates