విహారయాత్రలో విషాదం.. బీచ్ లో యువకుడు గల్లంతు

విహారయాత్ర విషాదం నింపింది. ఫ్రెండ్స్ తో  పాండిచ్చేరి టూర్ కు వెళ్లిన ఓ హైదరాబాద్ యువకుడు అక్కడి బీచ్ లో గల్లంతయ్యాడు. కుషాయిగూడ సాయినగర్ కు చెందిన నిఖిల్ రెడ్డి(22) గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అయితే 10 మంది ఫ్రెండ్స్ తో కలిసి శనివారం పాండిచ్చేరి టూర్ కు వెళ్లారు .సోమవారం సాయంత్రం అక్కడి బీచ్ కు వెళ్లారు.అందరు బీచ్ లో ఆడుతుండగా అలలకు నిఖిల్  కొట్టుకుపోయాడు. అది గమనించిన అతని ఫ్రెండ్స్ నిఖిల్ ను కాపాడదామని   ప్రయత్నించినా అలల తాకిడికి కొట్టుకుపోయాడు. నిఖిల్ ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో పాండిశ్చేరిలోని కొటకుప్పం పోలీసులకు కంప్లైంట్ చేశారు అతని స్నేహితులు.  ఈ విషయం తెలవడంతో నిఖిల్ తల్లి, కుటుంబ సభ్యులు శోఖ సంద్రంలో మునిగిపోయారు.

Latest Updates