పార్కింగ్ కు వస్తుందో యాప్..

ఖాళీ స్పేస్ యూజ్ చేసుకునేలా
డిజైన్ చేసిన హైదరాబాదీ
ఓనర్ టైమింగ్స్ ను బట్టి వేకెన్సీ, చార్జ్
కరోనాతో పెరిగిన ఓన్ వెహికల్ యూసేజ్

హైదరాబాద్, వెలుగు: సిటీలో ఇంటి నుంచి వెహికల్ తో బయటకు వెళ్లామంటే ముందుగా ఎదురయ్యేవి ట్రాఫిక్, పార్కింగ్ ఇబ్బందులు. రోజు రోజుకూ వెహికిల్స్ సంఖ్య పెరుగుతుండడంతో పార్కింగ్స్ స్పేస్ దొరకడం కష్టమవుతోంది. కొన్ని చోట్ల చాన్స్ ఉన్నాసెక్యూరిటీ ఉండదు. ఈ ప్రాబ్లమ్స్ కు పరిష్కారంగా.. అవసరం ఉన్నవారికి, పార్కింగ్ ఓనర్స్ కి పనికొచ్చేలా హైదరాబాదీ కుర్రాడు పార్కింగ్ యాప్ డిజైన్ చేశాడు. లాక్డౌన్ తో పబ్లిక్ ట్రాన్స్ పోర్టేన్ ఆగిపోయింది. ఓన్ వెహికల్స్ వాడే వాళ్లు ఎక్కువయ్యారు. దాంతో పార్కింగ్ ప్రాబ్లమ్ మరింత పెరగొచ్చు. తాను రూపొందించిన అప్లికేషన్ తర్వాత ఆ సమస్య తీరుతుందంటున్నాడు యాప్ మేకర్ అరవింద్.

ఖాళీగా ఉండకుండా…

సొంతిల్లు, అ పార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ ఏదైనా మస్ట్ గా పార్కింగ్ స్పేస్ ఉండేలా చూసుకుంటారు. ఇంట్లోకారో, బైకో తప్పనిసరి. ఉదయం ఆఫీసుకి వెళ్లాక ఆ పార్కింగ్ ప్లేస్ ఖాళీగా ఉంటుంది. ఆ ఏరియాకి వచ్చే వారికి పార్కింగ్ స్పేస్ ని రెంటుకు ఇస్తే సమస్యను సాల్వ్ చెయొచ్చు, ఓనర్ల‌కూ ఇన్ కమ్
ఉంటుందని ఆలోచించాడు అరవింద్. అదే ప్లాన్ తో PARK–IN–G యాప్ డిజైన్ చేశాడు. ఓనర్లు గంటకు ఇంత చొప్పున యాప్ లో మెన్షన్ చేస్తారు. దానికి అనుగుణంగా అవసరం ఉన్న వారు యూజ్ చేసుకోవచ్చు. యాప్ లో ఓనర్స్ డీటెయిల్స్, స్పేస్ ఖాళీగా ఉండే టైం ఉంటాయి. ట్రాఫిక్ వయోలేషన్స్, మానిటరైజింగ్ రిపోర్టింగ్ పై వర్క్ చేస్తున్న అరవింద్ 6 నెలలు రీసెర్చ్ చేసి ఈ యాప్ డిజైన్ చేశాడు.

ఇద్దరికీ ఉపయోగపడేలా..

నేను వర్క్ చేసే ఆఫీస్ లో పార్కింగ్స్ స్లాట్ కోసం నెలకు 2 వేలు కడుతున్నాం. ఇండివిజ్యువల్ గా పార్కింగ్ స్పేస్ ఉన్న వాళ్లు రెంటుకి ఇస్తే ఓనర్స్ కి కూడా బెనిఫిట్ ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్ మెంట్లలో ఉండేవారు తమ స్లాట్ ని రెంటుకి ఇవ్వచ్చు. బస్ స్టాప్, రైల్వే స్టేషన్లలోనూ యాప్ ను వాడొచ్చు. ఆ ప్లేస్లకు వెళ్లే ముందు పార్కింగ్ స్పేస్ ఉందో, లేదో చూసుకొని బుకింగ్ చేసుకోవచ్చు. లాక్ డౌన్ త‌ర్వాత యాప్ ను అందుబాటులోకి తీసుకొస్తాం. – అరవింద్, పార్కింగ్ యాప్ క్రియేటర్

మ‌రిన్ని వార్త‌ల కోసం..

Latest Updates