దేశంలోని మహిళా సంపన్నుల్లో 10మంది హైదరాబాదీలు

టాప్‌ 5లో దివీస్ నీలిమా
లిస్ట్‌‌లో యంగెస్ట్ ఉమెన్‌‌గా అంజనా రెడ్డికి చోటు
టాప్ 100 మహిళల సంపద రూ.2,72,540 కోట్లు

దేశంలోని మహిళల్లో సంపన్నురాలు రోష్ని నాడార్

2వ స్థానంలో బయోకాన్ కిరణ్ ముజుందర్​షా

కొటక్ వెల్త్, హురున్ ఇండియా రిపోర్టు

హైదరాబాద్, వెలుగు : ఢిల్లీకి చెందిన రోష్ని నాడార్ ఇటీవలే హెచ్‌‌సీఎల్ టెక్నాలజీస్‌‌కు చైర్‌‌‌‌పర్సన్‌‌గా ఎంపికయ్యారు. హురున్–కొటక్ వెల్త్ రిచ్ లిస్ట్ ప్రకారం ఆమె సంపద రూ.54,850 కోట్లుగా ఉంది. రోష్ని తర్వాత బయోకాన్ ఫౌండర్, ఎండీ కిరణ్ మజుందర్‌‌‌‌షా రెండో స్థానంలో ఉన్నారు. రూ.36,600 కోట్ల సంపదతో రెండో అత్యంత ధనికురాలిగా కిరణ్ నిలిచారు. 1978లో కిరణ్ బయోకాన్‌‌ను ఏర్పాటు చేశారు. మూడో స్థానంలో డయాబెటిక్, కార్డియోవాస్క్యులర్ మెడిసిన్ల కంపెనీ యూఎస్‌‌వీకి చెందిన లీలా గాంధీ తివారి ఉన్నారు. ఈమె సంపద రూ.21,340 కోట్లుగా ఉంది. జోహో ఫౌండర్ శ్రీధర్ సిస్టర్ రాధా వేంబు కొటక్ వెల్త్ హురున్ లిస్ట్‌‌లో ఐదో స్థానంలో ఉన్నారు. ఆమె వెల్త్ రూ.11,590 కోట్లుగా ఉంటుందని రిపోర్ట్ అంచనావేసింది. ఐఐటీ మద్రాసులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రాధా జోహోలో జాయిన్ అయ్యారు. ఈ లిస్ట్‌‌లో రిచెస్ట్ ప్రొఫెషనల్ మేనేజర్‌‌‌‌గా జయశ్రీ ఉల్లాల్ ఉన్నారు. ఆమె నెట్‌‌వర్త్ రూ.10,220 కోట్లు. లండన్‌‌లో పుట్టి, ఢిల్లీలో పెరిగిన జయశ్రీ.. క్లౌడ్ నెట్‌‌వర్కింగ్ కంపెనీ అరిస్టా నెట్‌‌వర్క్స్‌‌కు సీఈవోగా ఉన్నారు. జయశ్రీ అంతకుముందు సిస్కోలో పనిచేశారు. రమణ్ ముంజల్ భార్య రేణు ముంజల్‌‌కు కొటక్ హురున్ లిస్ట్‌‌లో ఏడో స్థానం దక్కింది. ఈమె సంపద రూ.8,690 కోట్లు. ప్రస్తుతం హీరో ఫిన్‌‌కార్ప్‌‌కు ఆమె మేనేజింగ్ డైరెక్టర్‌‌‌‌గా ఉన్నారు. అలెంబిక్ సీఈవో, ఎండీ అయిన మాలికా చిరాయు అమిన్‌‌ రూ.7,570 కోట్లతో ఎనిమిదో స్థానంలో, థెర్మాక్స్ అను అగా, మెహర్ పుదుంజీ రూ.5,850 కోట్లతో తొమ్మిదో స్థానంలో, నైకాకు చెందిన ఫాల్గుని నాయర్ అండ్ ఫ్యామిలీ రూ.5,410 కోట్లతో పదవ స్థానంలో ఉన్నారు.

జెండర్ పారిటీ పొందితే వెల్త్ క్రియేషన్…

ఇండియాలో 28 శాతం మాత్రమే మహిళా వర్క్‌‌ఫోర్స్ ఉన్నట్టు డేటా చెప్పింది. అయితే గ్లోబల్ స్టాండర్డ్ ప్రకారం 48 శాతం ఉమెన్ వర్క్‌‌ఫోర్స్ ఉండాలి. మేల్ ఎంట్రప్రెన్యూర్లకు వచ్చిన మాదిరి ఫీమెల్ ఎంట్రప్రెన్యూర్లకు ఫండింగ్ వస్తే.. ఇండియన్ ఎకానమీ 5 ట్రిలియన్ డాలర్లకు వస్తోందని హురున్, కొటక్ వెల్త్ ప్రతినిధులు చెప్పారు. జెండర్ పారిటీ(సమానత్వం) పొందినప్పుడు మాత్రమే ఇండియా అనుకున్న సమయానికి 5 ట్రిలియన్ డాలర్ల మార్క్‌‌ను తాకుతుందని, మరింత వెల్త్ క్రియేట్ అవుతుందని హురున్ ఇండియా చీఫ్ రీసెర్చర్ అనస్ రెహ్మాన్ జునైడ్ చెప్పారు. మెకెన్సీ సర్వే ప్రకారం అమెరికా మొత్తం హౌస్‌‌హోల్డ్ అసెట్స్‌‌లో 10 ట్రిలియన్ డాలర్లకు పైగా అమెరికన్ మహిళల చేతిలోనే ఉంటుందని చెప్పారు. ఈ అమౌంట్‌‌ పదేళ్లలో మూడింతలు పెరుగుతుందని కూడా తెలిపారు. ఇండియన్ ఎకానమీలో కూడా మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కొటక్ వెల్త్ మేనేజ్‌‌మెంట్ బిజినెస్ అధినేత ఐశ్వర్య దాస్ అన్నారు. మహిళలకు మరిన్ని సపోర్ట్ ప్రోగ్రామ్స్ అందించాలన్నారు. చైనాతో పోల్చుకుంటే ఇండియాలో సెల్ఫ్ మేడ్ మహిళలు తక్కువ మందే ఉన్నారని అనస్ అన్నారు. చైనాలో సెల్ఫ్ మేడ్ ఉమెన్ 60 శాతం ఉంటే.. ఇండియాలో కేవలం 25 శాతం మందే ఉన్నారని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఈ లిస్ట్‌‌లో 500 మంది వరకు చేరొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ లిస్ట్‌‌లో ఫార్మా సెక్టార్ డామినేట్ పొజిషన్‌‌లో ఉంది. ఫార్మాతో పాటు బీఎఫ్ఎస్‌ఐ, టెక్నాలజీ, కన్జంప్షన్, టెక్స్‌‌టైల్ రంగాల మహిళలు కూడా సంపద క్రియేషన్‌‌లో ముందంజలో ఉన్నారని రిపోర్ట్ తెలిపింది. ఉమెన్ ఎంట్రప్రెన్యూర్‌‌‌‌షిప్‌‌ను ప్రమోట్ చేసేందుకు నీతి ఆయోగ్‌‌తో సీకోవియా ఇండియా భాగస్వామ్యం కుదుర్చుకుంది.  నీతి ఆయోగ్ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్‌‌‌‌షిప్‌‌ ప్లాట్‌‌ఫామ్‌‌(డబ్ల్యూఈపీ)తో కలిసి సీకోవియా పనిచేస్తుంది.

40 ఏళ్ల కంటే తక్కువ ఏజ్ ఉన్న వారు 19 మంది…

32 మంది ఇండివిడ్యువల్స్‌‌తో ముంబై ఈ లిస్ట్‌‌లో టాప్‌‌లో ఉంది. ఆ తర్వాత న్యూఢిల్లీ(20 మంది), హైదరాబాద్(10 మంది) ఉన్నారు. ఈ రిచ్ లిస్ట్‌‌లోని 19 మంది మహిళలు 40 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారే. జెట్‌‌సెట్‌‌గోకు చెందిన 32 ఏళ్ల కనికా తేక్రివాల్, హైదరాబాద్‌‌కు చెందిన యునివర్సల్ స్పోర్ట్స్‌‌బిజ్ అంజనా రెడ్డి(రూ.300 కోట్ల సంపద), సన్‌‌ఫార్మాకు చెందిన విధి సంఘవి ఈ లిస్ట్‌‌లో యంగెస్ట్‌‌ ఉమెన్‌‌గా నిలిచారు. అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌‌‌‌ప్రైజ్ నుంచి ఈ లిస్ట్‌‌లో ఎక్కువ మంది మహిళా లీడర్లు ఉన్నారు. ఆ తర్వాత గోద్రెజ్ గ్రూప్ నుంచి చోటు దక్కించుకున్నారు. అపోలో నుంచి ప్రీతా రెడ్డి, సునీతా రెడ్డి, శోభన కామినేని, సంగీతా రెడ్డిలు ఈ లిస్ట్‌‌లో  ఉన్నారు.

ఇండియాలో అత్యంత చురుకైన రిచెస్ట్ ఉమెన్‌‌గా హెచ్‌‌సీఎల్ టెక్నాలజీస్‌‌కు చెందిన రోష్ని నాడార్ నిలిచారు. కొటక్ వెల్త్‌‌తో కలిసి హురున్ ఇండియా విడుదల చేసిన టాప్ 100 ఉమెన్ వెల్త్ క్రియేటర్స్, లీడర్స్‌‌ లిస్ట్‌‌లో ఆమెకు మొదటి స్థానం దక్కింది. ఈ లిస్ట్‌‌లో హైదరాబాద్‌‌కు చెందిన దివీస్ ల్యాబోరేటరీస్ డైరెక్టర్ నీలిమా మోటపర్తి నాలుగో స్థానంలో నిలిచారు. నీలిమ సంపద రూ.18,620 కోట్లుగా ఉన్నట్టు హురున్ కొటక్ వెల్త్ లిస్ట్ చెప్పింది. ఈ లిస్ట్‌‌లో సెల్ఫ్ మేడ్ బిజినెస్ ఎంట్రప్రెన్యూర్లు, స్టార్టప్ ఫౌండర్లు, ప్రొఫెషనల్ మేనేజర్లు ఉన్నారు. ఈ లిస్ట్‌‌లో ఉన్న ఉమెన్ వెల్త్ క్రియేటర్ల మొత్తం సంపద రూ.2,72,540 కోట్లుగా ఉంది.

for more News….

కరెంటు పోల్​ ఎక్కడం కోసం.. కోర్టు మెట్లెక్కి గెలిచింది

మొక్కల పెంపకంలో కొత్త ట్రెండ్ మొదలుపెట్టిన రిటైర్డ్ టీచర్

for live updates watch..

Latest Updates