గుండె మార్పిడి కోసం హైదరాబాద్‌లో గ్రీన్‌ కారిడార్‌

గుండె మార్పిడి కోసం హైదరాబాద్ లో పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్ లో బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి గుండెను నాంపల్లిలోని కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లాలి. దీంతో పోలీసులు గ్రీన్ కారీడర్ ఏర్పాటు చేసి దారిపొడవునా ఎలాంటి ఆటంకం లేకుండా అంబులెన్స్ ను వేగవంతంగా నాంపల్లి కేర్ ఆస్పత్రికి తరలించారు. మీర్ పేట్ కు చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతని గుండెను.. బ్రెయిన్ డెడ్ అయి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి అమర్చనున్నారు. ఇరు కుటుంబసభ్యులు ఒప్పుకోవడంతో వారి అవయవాలను మార్చేందుకు సిద్ధమయ్యారు వైద్యులు.

Latest Updates