ఆరెంజ్ ఆర్మీ జోరు కొనసాగిస్తుందా.?

వరుస విజయాలతో జోరుమీదున్న సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ మరో కీలక పోరుకు సిద్ధమైంది.వారం లోపలే టైటిల్‌ ఫేవరెట్‌ చెన్నై సూపర్‌‌‌‌కింగ్స్‌ తో మరోసారి తలపడ నుంది. సొంతగడ్డపై గతవారం చెన్నైపై అలవోక విజయం సాధించిన ఆరెంజ్‌ ఆర్మీ.. మరోసారి అదే ప్రదర్శన పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. మరోవైపు ఈ మ్యాచ్‌ లో విజయం సాధించి ఫ్లే ఆఫ్‌ బెర్త్‌ ను దక్కించుకోవడంతో పాటు టాపార్డర్‌‌‌‌ సమస్యలకు చెక్‌ పెట్టాలని ధోనీసేన భావిస్తోంది.

ఓపెనర్లదే జోరు

ఈ సీజన్‌ లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ సాధించిన అద్భుత విజయాల వెనుక ఓపెనర్ల ద్వయం జానీబెయిర్‌‌‌‌స్టో , డేవిడ్‌ వార్నర్‌‌‌‌ల కృషి ఎంతగానో ఉంది. వీరిద్దరి ధనాధన్‌ బ్యాటింగ్‌‌‌‌తోనే ఇప్పటివరకు దాదాపు అన్ని మ్యాచ్‌ లను ఆరెంజ్‌ ఆర్మీ నెగ్గిందనడంలో ఎలాంటి సందేహంలేదు. అయితే చెన్నైతో మ్యాచ్‌ అనంతరం బెయిర్‌‌‌‌స్టో సేవలు దూరం కానున్నాయి. ప్రపంచకప్‌ సన్నాహక శిబిరానికి హాజరు కావాల్సి ఉండడంతో తను జట్టును వీడి ఇంగ్లండ్‌ టీమ్‌ తో కలవనున్నా డు. ఇది ఆరెంజ్‌ ఆర్మీకి చాలా పెద్ద ఎదురుదెబ్బ అనడంలో సందేహం లేదు. ఇప్పటికే మిడిలార్డర్‌‌‌‌ వైఫల్యం తో సతమతమవుతున్న రైజర్స్‌కు ఇది నిరాశే. దీంతో ఈ మ్యాచ్‌ లో గెలిచి బెయిర్‌‌‌‌స్టో కు ఘనంగా వీడ్కోలు ఇవ్వాలని టీమ్‌ మేనేజ్‌ మెంట్‌ ఆశిస్తోంది. అలాగే కెప్టెన్‌గా కేన్‌ విలియమ్సన్‌ జట్టును ముందుండి నడిపించాల్సిన అవసరముంది. గతమ్యాచ్‌ లో మిడిలార్డర్‌‌‌‌కు బ్యాటింగ్‌‌‌‌ అవకాశం రాకపోయినా విజయ్ శంకర్‌‌, యూసుఫ్‌ పఠాన్‌ ,దీపక్‌ హుడా, మనీశ్‌ పాండే తమ బ్యాట్లకు పదును పెట్టాల్సి ఉంది. ఆల్‌ రౌండర్‌‌‌‌గా రషీద్‌ ఖాన్‌ అదరగొడుతున్నా డు. బౌలింగ్‌‌‌‌లో భువనేశ్వర్‌‌‌‌ కుమార్‌‌‌‌, ఖలీల్‌ అహ్మద్‌ , సందీప్‌ శర్మ సత్తాచాటుతున్నారు. సొంతగడ్డపై గత మ్యాచ్‌ లో అన్నివిభాగాల్లో సత్తాచాటి చెన్నైను ఓడించిన విలియమ్సన్‌ సేన.. ఈమ్యాచ్‌ లో అలాంటి ప్రదర్శనే పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది.

టాపార్డర్‌‌‌‌ బెంగ తీరేనా..?

ఇప్పటివరకు అద్భుత విజయాలో సత్తాచాటిన డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌‌‌‌ కింగ్స్‌ప్రత్యర్థి గడ్డపై జరిగిన గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ముఖ్యంగా బ్యాటింగ్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ విఫలమవడం తోనే పరాజయాలు పాలయ్యాయి. ఇక టాపార్డర్‌‌‌‌లో షేన్‌ వాట్సన్‌ , ఫాఫ్‌ డుప్లెసిస్‌ , సురేశ్‌ రైనా విఫలవమడం జట్టును కలవర పరుస్తోంది.వీరంతా వీలైనంత త్వరగా గాడిన పడాల్సిన అవసరముంది. మరోవైపు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మ్యాచ్‌ లో కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ ఫామ్‌ లోకి వచ్చాడు. తనదైన మార్కు షాట్లతో వింటేజ్‌ ధోనీని గుర్తుచేశాడు. టోర్నీ చివరిదశకు వచ్చిన క్రమంలో తను గాడిన పడడంపై జట్టు ఆనందంగా ఉంది. ఇక మిడిలార్డర్‌‌‌‌లో అంబటిరాయుడు, కేదార్‌‌‌‌ జాదవ్‌ ఫర్వాలేదనిపిస్తున్నా రు.డ్వేన్‌ బ్రావో గత మ్యాచ్‌ లో బౌలింగ్‌‌‌‌లో అదరగొట్టినా.. బ్యాటింగ్‌‌‌‌తో కాస్త అసౌకర్యానికి లోనయ్యాడు. సిసలైన ఆల్‌ రౌండర్‌‌‌‌ పాత్రను రవీంద్ర జడేజా అద్భుతంగా పోషిస్తున్నాడు. బౌలర్లలోదీ పక్‌ చహర్, ఇమ్రాన్‌ తాహిర్‌‌‌‌ అదరగొడుతుండగా.. శార్దూల్‌ ఠాకూర్‌‌‌‌ ఫర్వాలేదనిపిస్తున్నాడు.మరొక్క మ్యాచ్‌ లో నెగ్గితే ఫ్లే ఆఫ్‌ బెర్త్‌ కన్ఫామ్‌ అయ్యే దశలో సొంతగడ్డపై జరిగే ఈమ్యాచ్‌లోనే ఆ ముచ్చట తీర్చు కోవాలని జట్టు పట్టు దలగా ఉంది. తర్వాతి మ్యాచ్‌ ల నుంచి రిజర్వ్‌‌‌‌ బెంచ్‌ సత్తాను కూడా పరీక్షించుకోవడానికి వీలవుతోంది. ఈక్రమంతో ఈ మ్యాచ్‌ లో గెలిచి నాకౌట్‌దశకు చేరుకోవడంతో పాటు తొలిమ్యాచ్‌ లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చు కోవాలని చెన్నై మేనేజ్‌ మెంట్‌ భావిస్తోంది.

జట్లు (అంచనా)

సన్రైజర్స్హైదరాబాద్ : విలియమ్సన్‌ (కెప్టెన్‌ ),బెయిర్‌‌‌‌స్టో , వార్నర్‌‌‌‌, శంకర్‌‌‌‌, హుడా, యూసుఫ్‌ ,రషీద్‌ , భువనేశ్వర్‌‌‌‌, సందీప్‌ , ఖలీల్‌ , నదీమ్‌ .

చెన్నై సూపర్‌‌‌‌కింగ్స్ : ధోనీ (కెప్టెన్‌ ), వాట్సన్‌ , డుప్లెసిస్‌ , రైనా, రాయుడు, జాదవ్‌ , బ్రావో, జడేజా,తాహిర్‌‌‌‌, దీపక్‌ చహర్‌‌‌‌, శార్దూల్‌ .

Latest Updates