క్లోరోక్విన్​ పనిచేస్తోంది..గాంధీలో 533 మంది హెల్త్ వర్కర్లపై 7 వారాల స్టడీ

హైదరాబాద్, వెలుగు: హెల్త్ వర్కర్లపై మలేరియా మందు హైడ్రాక్సీ క్లోరోక్విన్  పనిచేస్తోంది. కరోనా రాకుండా అడ్డుకునేందుకు ప్రొఫైలాక్టిక్  మెడిసిన్ గా హెల్త్ వర్కర్లు, కరోనా పేషెంట్ల కుటుంబ సభ్యులు వాడొచ్చని ఇదివరకే ఇండియన్  కౌన్సిల్  ఫర్  మెడికల్  రీసెర్చ్  (ఐసీఎంఆర్ ) సూచించిన సంగతి తెలిసిందే. మరి, అది బాగా పనిచేస్తుందో లేదో తెలుసుకునేందుకు గాంధీ ఆస్పత్రిలోని డిపార్ట్ మెంట్  ఆఫ్  కమ్యూనిటీ మెడిసిన్  రీసెర్చర్లు స్టడీ చేశారు. 533 మంది హెల్త్ వర్కర్లకు ఏడు వారాల పాటు ఆ మందును ఇచ్చి పరిశీలించారు. మంచి ఫలితాలిచ్చినట్టు గుర్తించారు. ఆ స్టడీకి సంబంధించిన మధ్యంతర నివేదికను కమ్యూనిటీ మెడిసిన్  డిపార్ట్ మెంట్  హెడ్  డాక్టర్  విమలా థామస్  బుధవారం ప్రభుత్వానికి అందజేశారు. క్లోరోక్విన్  ఎఫెక్ట్ లను స్టడీ చేసేందుకు 694 మంది హెల్త్ వర్కర్లను ఎంపిక చేసుకున్నారు. అందులో 533 మందికి క్లోరోక్విన్ ను  ఇచ్చారు. అందులో కరోనా పేషెంట్లను దగ్గరగా ఉండి ట్రీట్ చేసిన డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది 394 మంది ఉన్నారు. వాళ్లపై మందు పనితీరును ఏడు వారాల పాటు పరిశీలించారు. కరోనా లక్షణాలైన జ్వరం, గొంతు నొప్పి, దగ్గు వంటివి రాలేదని నిర్ధారించారు. అయితే కొందరు డాక్టర్లు, నర్సులకు మాత్రం కళ్లు తిరగడం, వికారం, తలనొప్పి, అల్సర్స్  వంటి సైడ్  ఎఫెక్ట్స్  వచ్చినట్టు గుర్తించారు. కొందరు సరైన టైంకు, మరికొందరు సరిపడా డోస్ లు తీసుకోలేదని గుర్తించారు. 93 మందికి సైడ్ ఎఫెక్ట్స్  వచ్చాయని నివేదికలో పేర్కొన్నారు. అయితే, ఇది మధ్యంతర నివేదిక మాత్రమేనని, తుది నివేదిక కాదని రిపోర్ట్ లో పేర్కొన్నారు.

దుర్గం చెరు కేబుల్ బ్రిడ్జి రెడీ

 

Latest Updates