హైపర్‌ సోనిక్‌ సక్సెస్.. అమెరికా, రష్యా, చైనా తర్వాత మనమే..

హైపవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా

హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీ వెహికల్‌ ప్రయోగం సక్సెస్‌

ఒడిశాలోని బాలాసోర్‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుం చి ప్రయోగం

అమెరికా, రష్యా, చైనా తర్వాత నాలుగో దేశం ఇండియా

సెకనుకు 2 కి.మీ. స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వెళ్లే మిసైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: హైపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోనిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీ డెమాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెహికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీడీవీ)ను ఇండియా విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని బాలాసోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అబ్దుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలాం టెస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి సోమవారం ఉదయం 11.03 గంటలకు జరిపిన పరీక్ష విజయవంతమైంది. ఈ ప్రయోగంతో అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ టెక్నాలజీని సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా టెస్టు చేసిన నాలుగో దేశంగా ఇండియా రికార్డు సృష్టించింది. దేశీయంగా డీఆర్డీవో డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన స్క్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జెట్ ఇంజిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీడీవీకు వాడి మన దేశం మరో రికార్డు నెలకొల్పింది. హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీడీవీ ప్రయోగం విజయవంతం కావడంతో డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీవో మరో ఐదేళ్లలో సెకనుకు రెండు కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకెళ్లే హైపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోనిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిసైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తయారు చేసేందుకు ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడీ అయింది.

చాలా ఉపయోగాలున్నయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

స్క్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన వెహికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నడిపించగలం అని చూపించడానికి హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీడీవీ ప్రాజెక్టును స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. అయితే ఈ స్క్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇంకా రకరకాల ఉపయోగాలు ఉన్నాయని సైంటిస్టులు చెప్పారు. తక్కువ ఖర్చుతో శాటిలైట్లను ప్రయోగించడానికి, లాంగ్ రేంజ్ క్రూయిజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిసైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తయారీకి ఈ టెక్నాలజీ యూజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతుందని వివరించారు.

అగ్ని మిసైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బూస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో..

అగ్ని మిసైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బూస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీడీవీని టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. సుమారు 5 నిమిషాల పాటు ప్రయోగం సాగింది. తొలుత హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీడీవీను అగ్ని మిసైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బూస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 30 కిలోమీటర్ల ఎత్తు వరకు తీసుకెళ్లింది. ఆ తర్వాత విడిపోయింది. తర్వాత వెహికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయి స్క్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్టయింది. 20 సెకన్ల పాటు మండిన తర్వాత వెహికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 6 స్పీడును అందుకుంది. డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీవో చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఆయన హైపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సోనిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిసైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతృత్వంలో టెస్టు జరిగింది. ఇండియా గతేడాది ఈ హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీడీవీను ప్రయోగించిందని యూరేషియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వార్తలొచ్చాయి. అగ్ని 1 ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి దీన్ని ప్రయోగించారని, కానీ సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేదని అందులో రాసుకొచ్చింది.

డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీవోకు కంగ్రాట్స్​: రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్​

హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీడీవీను సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ప్రయోగించిన సైంటిస్టులకు రక్షణ మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభినందనలు తెలిపారు. వాళ్లతో తాను మాట్లాడానని చెప్పారు. ఆ సైంటిస్టులను చూసి దేశం గర్విస్తోందన్నారు. ఆత్మనిర్భర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరుకోవడానికి ముందడుగు పడిందని ట్వీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.

ఏ దేశాలు ఎట్లెట్ల?

అవాన్‌‌గార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో రష్యా హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీవీని డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తోంది. దీని స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 20 అని ఆ దేశం చెబుతోంది. చైనా హైపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోనిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గైడెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హైపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోనిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రూజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిసైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రెడీ చేస్తోంది. డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో చేస్తున్న ఈ వెపన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌10 స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో దూసుకెళ్తుందని ఆ దేశం వెల్లడించింది. అమెరికా 2011లోనే అడ్వాన్స్​డ్​​ హైపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోనిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిసైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయింది. 3700 కిలోమీటర్ల దూరాన్ని ఇది చేరుకుంది.

హైపర్‌ సోనిక్‌ అంటే ఏంటి?

సౌండ్‌ స్పీడ్‌‌కు 5 రెట్ల కంటే ఎక్కువ స్పీడ్‌‌తో ప్రయాణించే మిసైల్స్‌ ను హైపర్‌ సోనిక్‌ మిసైల్స్‌ అంటారు. ఈ స్పీడ్‌‌నే మాక్‌ 5 స్పీడ్‌ అని కూడా అంటారు. స్క్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జెట్‌ ఇంజిన్లను హెచ్‌ఎస్‌టీడీవీకి వాడారు. ఈ ఇంజిన్లు గాలిలోని ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకొని హైడ్రోజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్యూయెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిపి ఎనర్జీ సృష్టిస్తాయి. దీంతో వెహికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విపరీతమైన స్పీడ్‌ అందుకుంటుంది. మరోరకం రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెట్‌ ఇంజిన్లు కూడా
ఉంటాయి. ఇవి వెహికల్స్‌ కు సూపర్‌ సోనిక్‌ స్పీడ్ను అందిస్తాయి.

For More News..

కరోనాకు భయపడి.. పిల్లలకు టీకాలు ఏపిస్తలే

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫీజు కట్టినోళ్లంతా పాస్!

అంపైర్‌ను బాల్​తో కొట్టిన జొకోవిచ్.. డిస్ క్వాలిఫై చేసిన రిఫరీలు

Latest Updates