అప్ గ్రేడెడ్ ఫీచర్స్ తో ఆకట్టుకుంటున్న ‘హ్యుండాయ్ శాంటా ఫే’

న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ హ్యుండాయ్ ఈ ఏడాది శాంటా ఫే ఎస్ యూవీ మోడల్ ను రివీల్ చేసింది. స్టైలిష్ ఎలిమెంట్స్, కొత్త ఫీచర్లతో కూడిన కొత్త శాంటా లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. రీడిజైన్ చేసిన ఫోర్త్ జనరేషన్ శాంటాకు అవుట్ సైడ్ తోపాటు ఇన్ సైడ్ కూడా టెక్నికల్ గా అప్ గ్రేడ్ చేశారు.

వెహికిల్ ముందు వైపు వైడ్ గ్రిల్ ఏర్పాటు చేశారు. 10.25 ఇంచ్ ల టచ్ స్క్రీన్ డిస్ ప్లే ఫీచర్ కూడా బాగుంది. దీంట్లో ప్రీలోడెడ్ మ్యాప్స్ ఉంటాయి. వీటితోపాటు శాటిలైట్ బేస్డ్ వాయిస్ గైడెడ్ నేవిగేషన్, రేర్ కెమెరా డిస్ ప్లేతోపాటు మొత్తం కార్ ఎంటర్ టైన్ మెంట్, కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఈ కార్ పై ఆసక్తిని కలిగిస్తున్నాయి.

‘కొత్త శాంటా ఫేను ప్రీమియం ఫీచర్స్ తో మాడ్రనైజ్డ్ చేశాం. ఎస్ యూవీ ప్రియులు ఇష్టపడే బోల్డ్ లైన్స్ ను ఒకవైపు నుంచి మరో వైపు వరకు ఎక్స్ టెండ్ చేశాం. ఇది వెహికిల్ కు మంచి లుక్ ఇచ్చింది. ఫ్యామిలీ ఫోకస్డ్ ఎస్ యూవీగా అద్భుతమైన ఫీచర్స్ తో దీన్ని తయారు చేశాం. శాంటా డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ కూడా భలేగా ఉంటుంది’ అని హ్యుండాయ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ డిజైన్ సెంటర్ హెడ్ యుప్ లీ తెలిపారు.

Latest Updates