నాకు ఎలాంటి జబ్బు లేదు: అమిత్ షా

తన ఆరోగ్యం బాగాలేదంటూ వస్తున్న పుకార్లపై స్పందించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, తాను ఎలాంటి జబ్బుతో బాధపడడంలేదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రిగా తన విధులను నిర్వర్తిస్తున్నానని తెలిపారు.

దేశంలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న టైంలో తాను విధి నిర్వహణలో తలమునకలుగా ఉన్నానని, ఇలాంటి రూమర్లను పట్టించుకోవడంలేదని స్పష్టం చేశారు షా. రూమర్ల విషయం తనకు తెలిసినా…పుకార్లు సృష్టించిన ఆ వ్యక్తుల వికృత మనస్తత్వానికే ఆ విషయం వదిలేశానని తెలిపారు. మొదట్లో ఈ విషయంపై స్పందించలేదని… అయితే, లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు బాధపడుతుండడంతో స్పందించక తప్పలేదని అమిత్ షా తెలిపారు.

Latest Updates