నేను కేసీఆర్ కింద కార్యకర్తను మాత్రమే : జోగు రామన్న

టీఆర్ఎస్ పార్టీకి తానూ ఓనర్ని కాదు.. కిరాయి దారున్ని కాదన్నారు మాజీ మంత్రి జోగు రామన్న. తాను కేసీఆర్ కింద కార్యకర్తను మాత్రమేనని స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత తొలిసారి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన జోగు రామన్న కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా బావోద్వేగానికి లోనయ్యారు. మంత్రి పదవి ఇచ్చినా, ఇవ్వకున్నా తానూ టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని తెలిపారు జోగు రామన్న.

Latest Updates