అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి రెడీ: రజినీకాంత్

తమిళ తలైవా రజినీకాంత్ మరోసారి తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాను పోటీకి సిద్దమని ప్రకటించారు. ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాక ప్రభుత్వం పడిపోతే తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు.. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా పోటీకి రెడీ అని రజినీ సమాధానం ఇచ్చారు. మే 23న లోక్ సభ ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన  తర్వాత తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని అన్నారు. మోదీ మరోసారి అధికారంలోకి వస్తారా? అంటూ మీడియా ప్రశ్నించగా అది కూడా మే 23నే  తెలుస్తుందిగా అంటూ రజినీ సమాధానం చెప్పారు.

 

 

Latest Updates