డంపింగ్ యార్డ్‌ను తరలించే బాధ్యత నాదే

జవహార్ నగర్ నుంచి డంపింగ్ యార్డ్ ను తరలించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్..మల్కాజ్ గిరి గల్లి నుంచి ఢిల్లీకి పంపింది మల్కాజ్ గిరి ప్రజలేనని తెలిపారు. TRS పార్టీ నేతలు ఎన్నికల సమయంలో హామీలు ఇస్తారు కానీ…వాటిని అమలు చేయరని ఆరోపించారు. మంత్రిగా పని చేయని మల్లారెడ్డి… TRS కార్పొరేటర్లుగా గెలిచిన వాళ్లు.. జవహార్ నగర్ అభివృద్ధికి కృషి చేస్తారని సన్నాసి మాటలు చెబుతున్నారని ఆరోపించారు.

అంతేకాదు మంత్రి మల్లారెడ్డి మాదిరిగా తాము డబ్బులు వసూలు చేయలేదన్నారు రేవంత్ రెడ్డి. కోట్లు పెట్టి సీట్లు కొన్నోళ్లు మీకు పనిచేయరన్నారు. జవహార్ నగర్ లో వందల ఎకరాల భూములు ఉన్నాయని..వాటికోసమే గద్దల్లా జవహార్ నగర్ చుట్టూ తిరుగుతున్నారని..ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. TRS వాళ్లు రాత్రుళ్లు మాత్రమే వస్తారని…ఓట్ల కోసం డబ్బులు ఇస్తారన్నారు. వాళ్లు ఇచ్చే డబ్బులు తీసుకుని ఓటు మాత్రం కాంగ్రెస్ కు వేయాలని కోరారు ఎంపీ రేవంత్ రెడ్డి.

Latest Updates