బీహార్‌ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిని నేనే

ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకున్న ఎంఎల్‌సీ కూతురు

బీహార్‌లో 2020లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని తానేనంటూ జేడీయూ ఎంఎల్‌సీ వినోద్ చౌదరి కుమార్తె పుష్పం ప్రియా చౌదరి ప్రకటించుకున్నారు. ప్రియ ప్రస్తుతం లండన్‌లో చదువుకుంటుంది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రియ ఈ పోస్టు పెట్టింది. 2020లో బీహార్‌లో జరిగే ఎన్నికలలో ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిని నేనేనని ప్రియ ప్రకటించింది. రాష్ట్రాన్ని ప్రేమించే వారు, రాజకీయాలను ద్వేషించే వారు తమ పార్టీలో చేరాలని ఆమె బీహార్ ప్రజలనుద్దేశించి పోస్టు పెట్టారు. అలాగే అసమర్థ రాజకీయ నాయకులను కూడా ఆమె సవాలు చేస్తూ మురికి రాజకీయాలను తిరస్కరించాలని కోరింది.

ప్రస్తుతం బీహార్‌ను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని బీజేపీ-జెడి(యు) -ఎల్‌జెపి కూటమి పాలిస్తోంది.

For More News..

ఎమ్మెల్యే దంపతులకు కేటీఆర్ క్లాస్.. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే?

కాంగ్రెస్‌ పార్టీకి సింధియా రాజీనామా

రాజకీయ పార్టీలకు రూ. 11, 234 కోట్ల విరాళాలు

మారుతీరావు సూసైడ్‌నోట్‌లో ఏముంది?

Latest Updates