కష్టపడి పనిచేసే ప్రెసిడెంట్ ను నేనే

వాషింగ్టన్ : అమెరికా చరిత్రలోనే అత్యంత కష్టపడి పనిచేసే ప్రెసిడెంట్ ను నేనేనని ట్రంప్ చెప్పారు. అలాంటి తనపై కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అమెరికాలోని కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకొని తనను టార్గెట్ చేశాయంటూ ఆయన మీడియా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో అద్భుతమైన అభివృద్ధి సాధించామని…అయినా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ట్విట్టర్ లో విమర్శించారు. కరోనా పేషెంట్లకు డిస్ ఇన్ ఫెక్ట్స్ ను ఎక్కించాలంటూ ట్రంప్ చేసిన కామెంట్లు దుమారం రేపాయి. ఈ కామెంట్ల పై పలు మీడియా సంస్థలు పలు స్టోరీలను ప్రసారం చేశాయి. దీంతో ట్రంప్ మీడియా సమావేశాలకు దూరంగా ఉన్నారు. ఐతే మొదటి నుంచి కొన్ని మీడియా సంస్థలపై ఆగ్రహంగా ఉన్న ఆయన తాజాగా తప్పుడు వార్తలు ప్రచారం చేసే వాటిపై దావా వేస్తామని హెచ్చరించారు. ఉదయం నుంచి రాత్రి వరకు వైట్ హౌజ్ లో పనిచేస్తుంటాను. వైట్ హౌజ్ ను వదిలి వెళ్లి చాలా నెలలు అయ్యింది. అయినప్పటికీ కొన్ని మీడియా సంస్థలు నన్ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నాయి. అని న్యూయార్క్ టైమ్స్ ను ఉద్దేశించి మరో ట్వీట్ చేశారు ట్రంప్.

Latest Updates