అమరులకు నా వందనాలు: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమరులకు సోషల్ మీడియా వేదికగా ఆయన నివాళులు అర్పించారు. ట్విట్టర్‌‌ వేదికగా ప్రజలకు విషెస్ చెప్పారు. ‘మనం స్వేచ్ఛా వాయువును పీల్చడానికి త్యాగాలు చేసిన అమరులకు నా నమస్కారాలు. దేశ వాసులందరికీ హ్యాప్పీ ఇండిపెండెంట్స్‌ డే’ అని కేజ్రీ ట్వీట్ చేశారు. రెడ్ ఫోర్ట్‌లో ఇండిపెండెంట్స్‌ డే వేడుకలకు ప్రధాని మోడీ హాజరవ్వడానికి కొద్దిసేపు ముందు కేజ్రీ ఈ ట్వీట్ చేశారు.

Latest Updates