భారతరత్నఅందుకోవడమే నా కల..ఆయనే స్ఫూర్తి

క్రీడారంగం నుంచి పద్మ విభూషణ్‌ అందుకున్న తొలి మహిళగా నిలిచిన బాక్సర్‌ మేరీ కోమ్‌ దేశ అత్యున్నత పౌర పురస్కారం‘భారతరత్న’ అందుకోవడం తన కల అని చెప్పింది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంస్య పతకం గెలిచిన మేరీ మాట్లాడుతూ..‘భారతరత్న అందుకోవడం నా కల. దానిని సాకారం చేసుకునేందుకు పద్మ విభూషణ్‌ స్ఫూర్తినిస్తుంది. అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న ఏకైక క్రీడా కారుడు సచిన్‌ టెండూ ల్కర్‌ . అతనే నాకు ఆదర్శం. భారతరత్న అందుకునే తొలి మహిళగా, రెండోస్పోర్ట్స్‌ పర్సన్‌ గా నిలుస్తాననే నమ్మకముంది. ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించడమే ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం. ఆ తర్వాతే మిగిలిన విషయాలు ఆలోచిస్తా . ఒక వేళ క్వాలిఫై అయ్యి టోక్యోలో గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధిస్తే నా కల ఖచ్చితంగా నెరవేరుతుంది’ అని చెప్పుకొచ్చింది.

see more news

లోకేష్.. చికెన్ షాప్ ముందు తొడకొట్టినట్టుంది..కోసి కూరొండుతరు జాగ్రత్త

‘29న ప్రకాశ్ రాజ్, కుమారస్వామిని చంపేస్తాం‘