అక్క అఖిల ప్రియకు మందులు ఇవ్వడానికే వచ్చా

సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ విషయంలో తనకు ఏమీ తెలియదని భూమా అఖిల ప్రియ చెల్లి మౌనిక తెలిపింది. తన అక్క అఖిల ప్రియకు మందులు ఇవ్వడానికి వచ్చినట్లు చెప్పింది. హైదరాబాద్ బేగం పేట పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడింది. అఖిల ప్రియ ఇక్కడ లేదని పోలీస్ లు చెప్తున్నారని… చివరకు ఇంటి నుంచి తెచ్చిన భోజనం, మందులను కూడా పోలీసులు అనుమతించడం లేదని పేర్కొంది.

బోయిన్‌ పల్లి కిడ్నాప్‌ కేసులో టీడీపీ మాజీ మంత్రి అఖిల ప్రియను బుధవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇదే కేసుకు సంబంధించి అఖిల ప్రియ భర్త భార్గవ్‌ రామ్ పరారీలో ఉండగా‌, ఆయన సోదరుడు చంద్రబోసును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌ తర్వాత వీరిని బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ నుంచి అఖిల ప్రియను బేగంపేట్‌ ఉమెన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Latest Updates