ప్రధాని పదవిపై ఆశలేదు: నితిన్ గడ్కరీ

ప్రధాని పదవిపై ఆశ లేద… ఆ రేసులో లేనంటూ మరోసారి స్పష్టం చేశారు కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ. ప్రధాని కావాలనే ఆశ లేదని.. దానికి సంబంధించి తన పొలిటికల్ కెరీర్ లో ఎక్కడా మాట్లాడలేదని గుర్తుచేశారు. ఇవాళ (సోమవారం) నాగ్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన గడ్కరీ మీడియాతో మాట్లాడారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కనీసం 270 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మహారాష్ట్రలో కూడా ఈసారి బీజేపీ – శివసేన కూటమి హవా కొనసాగుతుందన్నారు గడ్కరీ. 40 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా మిత్రపక్షాలతో కలుపుకుని బీజేపీ 300 కు పైగా స్థానాలను కైవసం చేసుకుంటుందన్నారు. మోడీ ప్రభుత్వ పాలనపై దేశ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. నాగ్‌పూర్ సెగ్మెంట్ లో తనకు మద్దతు బాగానే ఉందని.. ఈసారి కూడా భారీ మెజార్టీతో గెలుపొందుతానంటూ చెప్పుకొచ్చారు గడ్కరీ.

Latest Updates