కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి నష్టపోయా

కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడం కారణంగా తానేవిూ పొందలేదని, దీంతో తానే నష్టపోయానని శిరోమణి అకాలీదళ్‌ నాయకురాలు హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ తెలిపారు. అగ్రి బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్‌లో రైతుల నిరసనలు తీవ్రమైన క్రమంలో సోమవారం పార్టీ సమావేశంలో హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ మాట్లాడారు.  అయితే తన రాజీనామాతో రైతుల సమస్యలు కేంద్రం దృష్టికి వెళ్లాయని చెప్పారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతుండటంతోనే పార్లమెంట్‌ సమావేశాలను కుదించారని హర్‌సిమ్రత్‌ కౌర్‌ విమర్శించారు.

Latest Updates