ప్రత్యర్థి కళ్లలో భయం చూడాలని : కోహ్లీ

న్యూఢిల్లీ : విరాట్‌‌ కోహ్లీ బ్యాటింగ్‌‌కు వస్తున్నాడంటే ఏ జట్టైనా, బౌలరైనాభయపడాల్సిందే. పిచ్‌‌పై టీమిండియా కెప్టెన్‌‌ చూపిన ప్రభావం అలాంటిది. ఇప్పుడైతే ఇలా ఉంది కానీ 2012 ఆస్ట్రేలియా టూర్‌‌కు ముందు పరిస్థితి వేరేలా ఉండేదని ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ చెప్పాడు. తాను క్రీజులోకి వస్తుంటే ప్రత్యర్థి కళ్లలో భయం కాదు కదా, కనీసం గౌరవం కూడా కనిపించేది కాదన్నాడు. ప్రత్యర్థి తనను లెక్కచేయకపోవడం తనలో కసిని పెంచిందన్నాడు. ఏదో ఒకడొచ్చాడు అన్నట్లు కాకుండా, వీడిని త్వరగా ఔట్‌‌ చేయకపోతే తాము ఓడిపోవడం గ్యారంటీ అని ప్రత్యర్థి అనుకోవాలని డిసైడయ్యి ఆట తీరును మార్చుకున్నానని విరాట్‌‌ తెలిపాడు. ఓ ప్లేయర్‌‌గా సచిన్‌‌ టెండూల్కర్‌‌కు ఉన్నంత స్కిల్‌‌ తనకు లేదన్న కోహ్లీ శ్రమనే నమ్ముకున్నానని చెప్పాడు. 2012లో ఆసీస్‌‌ టూర్‌‌ తర్వాత ఇరుజట్ల మధ్య ఉన్న తేడాను గమనించానన్న కోహ్లీ.. ఆటతీరు, ట్రైనింగ్‌‌, డైట్‌‌ మార్చుకోకపోతే వరల్డ్‌‌ బెస్ట్‌‌ టీమ్స్‌‌తో పోటీ పడలేమని గ్రహించానని చెప్పాడు. ఎప్పుడు ది బెస్ట్‌‌గా ఉండాలనే తపన ఆట పట్ల తన దృష్టిని మార్చిందన్నాడు. ఫిట్‌‌నెస్‌‌ ట్రైనింగ్‌‌ తన జీవన విధానంలో ఓ భాగమన్న కోహ్లీ.. వరల్డ్‌‌కప్‌‌లో తన ఎనర్జీ లెవల్‌‌ 120 శాతం ఉందన్నాడు.

Latest Updates