
‘సీఎం కోరారనే చదువుతున్నా తప్ప దీంతో నేను ఏకీభవించను.. ఇదేమీ పాలసీ ప్రోగ్రామ్ కాదు. ఇది ప్రభుత్వ యాంగిల్ అని సీఎం చెప్పారు. దీనిని వ్యతిరేకిస్తున్నా కూడా సీఎంను గౌరవించేందుకే ఈ పేరా చదువుతున్నా’ కేరళ అసెంబ్లీలో బడ్జెట్స్పీచ్లో సీఏఏ ప్రస్తావనకు సంబంధించిన మ్యాటర్‌పై గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్.
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీలో బుధవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బడ్జెట్ సెషన్ ప్రారంభిస్తూ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ప్రసంగించారు. బడ్జెట్ స్పీచ్‌లో సీఏఏ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఈ విషయంలో ప్రభుత్వంతో ఏకీభవించకపోయినా, సీఎం కోరిక ప్రకారం దీనిని చదువుతున్నా అని చెప్పి, ప్రసంగాన్ని కంటిన్యూ చేశారు. ఇది సీఏఏపై ప్రభుత్వ అభిప్రాయమే కానీ తనది కాదని చెప్పారు. ‘మతం ఆధారంగా పౌరసత్వం కల్పించడం సెక్యులరిజానికి వ్యతిరేకం.. మన రాజ్యాంగానికి పునాది సెక్యులరిజమే. మతం ఆధారంగా పౌరసత్వం కల్పించేందుకు తీసుకొచ్చిన సీఏఏ మన రాజ్యాంగ విలువలకు వ్యతిరేకమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే, సీఏఏను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. దీనిపై సుప్రీంకోర్టులో సూట్ కూడా ఫైల్ చేసింది’ అని గవర్నర్ పేర్కొన్నారు. తర్వాతి పేరాలో.. ‘బలమైన కేంద్ర, రాష్ట్రాలే ఫెడరలిజానికి పునాదులు. జాతీయ ప్రయోజనాల విషయంలో రాష్ట్రాల భయాందోళనలను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. మరీ ముఖ్యంగా రాజ్యాంగ విలువలతో ముడిపడిన అంశమైతే ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనయ్యే అవకాశం ఉంది’ అంటూ గవర్నర్ ప్రసంగించారు.
గవర్నర్‌ను అడ్డుకున్న యూడీఎఫ్ ఎమ్మెల్యేలు
అంతకుముందు, బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌ను కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూడీఎఫ్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నరు. సిటిజన్‌షిప్ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. సభలో యాంటీ సీఏఏ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ‘గవర్నర్ గో బ్యాక్’ అంటూ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. గవర్నర్‌ను సభలో అడుగు పెట్టనీయకుండా అడ్డుకున్నరు. గవర్నర్, సీఎం పినరయి విజయన్, స్పీకర్ పి.శ్రీరామకృష్ణన్ పదే పదే విజ్ఞప్తి చేసినా ఎమ్మెల్యేలు వినిపించుకోలేదు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది కల్పించుకుని దారిచేస్తూ గవర్నర్‌ను పోడియం వద్దకు తీసుకెళ్లారు. పోడియం వద్దకు చేరుకోగానే నిరసనకారులకు గవర్నర్ చేతులు జోడించి థాంక్స్ చెప్పారు. జాతీయ గీతాలాపన జరిగిన తర్వాత ప్రతిపక్ష సభ్యులు వెల్ వద్దకు చేరుకుని గవర్నర్ గో బ్యాక్ అంటూ సభ్యులు నినాదాలు చేశారు. వారిని పట్టించుకోకుండా గవర్నర్ ఆరిఫ్ తన స్పీచ్ మొదలెట్టారు. దీంతో కాంగ్రెస్, యూడీఎఫ్ ఎమ్మెల్యేలు వాక్ అవుట్ చేసి, అసెంబ్లీ గేట్ వద్ద ధర్నా చేశారు.
నిరసన చేయక తప్పలేదు.. రమేశ్ చెన్నితాల
‘అసెంబ్లీని, సభ్యులను అవమానించేలా గవర్నర్ మాట్లాడడంతో నిరసన చేయక తప్పలేదు. సీఏఏను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానించడాన్ని గవర్నర్ తప్పుబట్టారు. ఈ తీర్మానంకోసం అసెంబ్లీ టైం, మనీ వేస్ట్ చేశారన్న గవర్నర్ కామెంట్స్సరికాదు. ప్రజల అభిప్రాయం, కోపం, భయాన్నే సభ్యులు అసెంబ్లీలో ప్రదర్శించారు. గవర్నమెంట్, గవర్నర్ ఇద్దరూ ఒక్కటే.. సీఎం పినరయి విజయన్ కేంద్ర ప్రభుత్వంతో, బీజేపీతో సంధి కోసం ప్రయత్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో సీఏఏ వ్యతిరేక ఆందోళనలను మరింత తీవ్రం చేయడమే ప్రతిపక్ష పార్టీగా మా ముందున్న
కర్తవ్యం’.