నాకు న్యాయం జరిగేలా లేదు

Supreme Court refuses to grant interim stay on electoral bonds

చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) రంజన్ గొగోయ్,తనను లైంగికంగా వేధించారంటూ ఆరోపించిన సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని మంగళవారం ఇన్ హౌజ్ ఎంక్వైరీ నుంచి మధ్యలో బయటకొచ్చేశారు. విచారణ జరుగుతున్న తీరును చూస్తుంటే తనకు న్యాయం జరిగే లా లేదన్నా రు. సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణలను జస్టిస్ ఎస్.ఏ.బాబ్డే నేతృత్వంలో ని జస్టిస్ ఇందిరా మల్హో త్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన ప్యానల్ విచారిస్తు న్న సంగతి తెలిసిందే. మూడు రోజులపాటు జరగాల్సి న ఎంక్వైరీలో మంగళవారం చివరి రోజు. అయితే విచారణ జరుగుతుండగా బాధితురాలు మధ్యలో బయటకు వచ్చేశారు. విచారణవాతావరణం భయానకంగా ఉండటం వల్లే వచ్చేశానని మీడియాతో చెప్పారు. నా ఫిర్యాదుపై సీజేఐ నుంచి సమాధానం కోరారో లేదో ప్యానల్ చెప్ప- లేదు. రెం డు ఫోన్ నంబర్ల కాల్స్, వాట్సాప్ రికార్డులను తె ప్పించాలని కో రాను . ఇందుకు ప్యానల్ ఒప్పుకోలేదు. నా అడ్వొకేట్ వృందా గ్రోవర్ ను విచారణ జరిగే ప్రదేశానికి అనుమతించలేదు. అడ్వొకే ట్ లేకుండా రానంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ప్యానల్ హెచ్చరించింది. లైంగిక వేధింపులపై ఎందుకు ఇంత ఆలస్యంగా కంప్లైంట్ చేశారని ప్యానల్ పదే పదే నన్ను ప్రశ్నించింది. ఈ సంఘటనలతో న్యాయం నా నుంచి దూరం అవుతున్నట్లు అనిపించింది. తీవ్ర ఒత్తిడికి లోనయ్యాను. దీంతో ఒక చెవి వినికిడి శక్తిని కోల్పోయింది.దాంతో విచారణలో కొన్ని కీలకమైన పాయింట్లు వినకుండానే, స్టేట్ మెంట్ ఇచ్చా ను. ప్యానల్ విచారణ నుంచి వచ్చేస్తుండగా, దాదాపు నలుగురు వ్యక్తులు నన్ను వెంబడించారు. దీంతో నేను మరింత ఆందోళనకు గురయ్యాను. జస్టిస్ ఇందిరా మల్హో త్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీ విచారణను రికార్డు చేయలేదు. కనీసం నా స్టేట్ మెంట్ కాపీని కూడా ఇవ్వలేదు” అంటూ ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు.

Latest Updates